అవినీతి చక్రవర్తి చంద్రబాబు | YSRCP MLA Ijazah Slams On chandrababu Naidu Kurnool | Sakshi
Sakshi News home page

అవినీతి చక్రవర్తి చంద్రబాబు

Jul 18 2018 7:41 AM | Updated on Jul 28 2018 3:15 PM

YSRCP MLA Ijazah Slams On chandrababu Naidu Kurnool - Sakshi

మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఐజయ్య

మిడుతూరు: నాలుగేళ్ల పాలనలో అడ్డగోలుగా రూ. 4 లక్షల కోట్లు సంపాదించి అవినీతి చక్రవర్తిగా సీఎం చంద్రబాబు  పేరు గడించారని ఎమ్మెల్యే ఐజయ్య విమర్శించారు.   నందికొట్కూరు పట్టణంలోని ఆయన స్వగృహంలో మంగళవారం విలేకరులతో మాట్లాడారు.  1500 రోజుల పాలనలో ఏమి సాధించారని పండగ చేసుకుంటున్నారని  టీడీపీ నేతలను నిలదీశారు. 23 మంది ఎమ్మెల్యేలను అడ్డగోలుగా కొనుగోలు చేసినందుకా లేక ప్రజా సంక్షేమాన్ని గాలికి వదిలేసినందుకా అని ప్రశ్నించారు.

తనది 40 ఏళ్లు రాజకీయ అనుభవమని చంద్రబాబు గొప్పలు చెప్పుకోవడం తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. దళితులకు, మహిళలకు రక్షణ కూడా కల్పించలేకపోయారన్నారు. అంతేకాదు ఓటుకు నోటు కేసులో దొరికిపోయి ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టారన్నారు. అదే తమ పార్టీ  అధినేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రత్యేక హోదా, ప్రజా సమస్యల పరిష్కారం కోసం నాలుగేళ్లుగా అలుపెరగని పోరాటం చేస్తున్నారన్నారు.   వైఎస్సార్‌సీపీ ఎంపీలతో పాటు  టీడీపీ ఎంపీలు రాజీనామా చేసి ఉంటే   ప్రత్యేక హోదా వచ్చేదన్నారు.   రానున్న ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌సీపీ విజయం సాధించి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం కావడం తథ్యమని చెప్పారు.  ఈ సమావేశంలో   పార్టీ నాయకులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement