ఈసీని కలువనున్న వైఎస్సార్‌సీపీ నేతలు

సాక్షి, న్యూఢిల్లీ: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకుల బృందం ఇవాళ (సోమవారం) 6. 30 గంటలకు కేంద్ర ఎన్నికల సంఘాన్ని కలువనుంది. వైఎస్సార్‌సీపీ సీనియర్ నేతలైన మాజీ ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పీఏసీ చైర్మన్ బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, రాజ్యసభ సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డి ఈసీని కలువనున్న బృందంలో ఉన్నారు.
కేంద్ర ఎన్నికల సంఘం ఆదివారం సాయంత్రం లోక్‌సభతోపాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తొలిదఫా ఎన్నికల్లో ఏపీలో ఈ నెల 11న అసెంబ్లీ, లోక్‌సభ పోలింగ్ ఒకేరోజు జరగనుంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ నేతలు ఈసీని కలువబోతున్నారు.
*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి