‘ఆయన టీడీపీని భ్రష్టు పట్టించాడు’

YSRCP Leader Dhadi Veera Bhadra Rao Slams Chandrababu Naidu In Visakapatnam - Sakshi

విశాఖపట్నం: తెలుగు వారి అభ్యున్నతి కోసం పుట్టిన టీడీపీని నారా చంద్రబాబు నాయుడు భ్రష్టు పట్టించారని వైఎస్సార్‌సీపీ నేత దాడి వీరభద్రరావు తీవ్రంగా విమర్శించారు. విశాఖపట్నంలో దాడి వీరభద్రరావు విలేకరులతో మాట్లాడుతూ.. కేవలం పదవి, డబ్బు మాత్రమే చంద్రబాబుకు ముఖ్యమని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్‌ అధ్యక్షులు రాహుల్‌ గాంధీ పొరపాటున గెలిస్తే చంద్రబాబు కేంద్రంలో మంత్రి పదవి పొందాలని తాపత్రయపడుతున్నాడని ఎద్దేవా చేశారు.

ఎన్నికలు జరుగుతున్న సమయంలో పోలవరం ప్రాజెక్టుపై సమీక్ష నిర్వహించి బాబు నిబంధనలు ఉల్లంఘించారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడిని కొనసాగించడం తగదన్నారు. గవర్నర్‌ జోక్యం చేసుకుని వెంటనే సీఎంగా చంద్రబాబుని తొలగించాలని డిమాండ్‌ చేశారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top