
సాక్షి, కడప సెవెన్‌రోడ్స్ : జిల్లాలో లోక్‌సభ, శాసనసభ సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన నామినేషన్ల పరిశీలన మంగళవారం ముగిసింది. ఉదయం నుంచే రిటర్నింగ్ అధికారులు అభ్యర్థుల సమక్షంలో నామినేషన్లు పరిశీలించారు. కడప లోక్‌సభకు మొత్తం 24 మంది నామినేషన్లు దాఖలు చేయగా, అందులో 17 నామినేషన్లు ఆమోదించారు. మిగతా ఏడు నామినేషన్లను వివిధ కారణాలతో తిరస్కరించారు. రాజంపేట లోక్‌సభకు 20 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 12 నామినేషన్లను ఆమోదించి ఎనిమిదింటిని తిరస్కరించారు. కడప, రాజంపేట లోక్‌సభ స్థానాల్లో మొత్తం 44 నామినేషన్లకుగాను 29 నామినేషన్లు ఆమోదించి, 15 నామినేషన్లను తిరస్కరించారు. జిల్లాలోని పది అసెంబ్లీ స్థానాలకు 215 నామినేషన్లు దాఖలయ్యాయి. అందులో 161 నామినేషన్ పత్రాలు సక్రమంగా ఉన్నట్లు రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు. మిగిలిన 54 నామినేషన్లు వివిధ కారణాల వల్ల తిరస్కరించారు. ఈనెల 28వ తేది వరకు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంది. బుధవారం సాంయత్రానికి ఎన్నికల చిత్రం స్పష్టమవుతుంది.
లోక్‌సభ
నియోజకవర్గం | నామినేషన్లు | ఆమోదం | తిరస్కరణ |
కడప | 24 | 17 | 07 |
రాజంపేట | 20 | 12 | 08 |
మొత్తం | 44 | 29 | 15 |
అసెంబ్లీ నియోజకవర్గాలు
నియోజకవర్గం | నామినేషన్లు | ఆమోదం | తిరస్కరణ |
బద్వేలు | 18 | 14 | 04 |
రాజంపేట | 22 | 19 | 03 |
కడప | 22 | 16 | 06 |
రైల్వేకోడూరు | 21 | 16 | 05 |
రాయచోటి | 15 | 10 | 05 |
పులివెందుల | 23 | 12 | 11 |
కమలాపురం | 21 | 17 | 04 |
జమ్మలమడుగు | 34 | 30 | 04 |
ప్రొద్దుటూరు | 17 | 14 | 03 |
మైదుకూరు | 22 | 13 | 09 |
మొత్తం | 215 | 161 | 54 |