నవ వసంతంలోకి వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ | YSR Congress Party 9th Formation Day | Sakshi
Sakshi News home page

నేడు వైఎస్సార్‌సీపీ ఆవిర్భావ దినోత్సవం

Mar 12 2019 9:18 AM | Updated on Mar 12 2019 9:18 AM

YSR Congress Party 9th Formation Day - Sakshi

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారంతో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో ఏడాదిలోకి అడుగు పెడుతోంది.

సాక్షి, హైదరాబాద్‌: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ మంగళవారంతో ఎనిమిదేళ్లు పూర్తి చేసుకుని తొమ్మిదో ఏడాదిలోకి అడుగు పెడుతోంది. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా ఆవిర్భావ ఉత్సవాలు నిర్వహించాలని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ పిలుపునిచ్చింది.

ఉదయం 10 గంటలకు అన్ని పార్లమెంటు జిల్లా కేంద్రాలు, అన్ని అసెంబ్లీ నియోజకవర్గ, మండల కేంద్రాలలో పార్టీ జెండాను ఆవిష్కరించి, సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించాలని పార్టీ ప్రధాన కార్యదర్శి వి. విజయసాయి రెడ్డి పార్టీ శ్రేణులకు విజ్ఞప్తి చేశారు. హైదరాబాద్‌లోని పార్టీ కార్యాలయంలో మంగళవారం ఆవిర్భావ వేడుకలు జరుగుతాయని, పార్టీ శ్రేణులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని ఆయన కోరారు. 

Advertisement
 
Advertisement
Advertisement