142వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర | YS Jagan Prajasanklpayatra 142 Day Starts | Sakshi
Sakshi News home page

142వ రోజు ప్రారంభమైన వైఎస్‌ జగన్‌ పాదయాత్ర

Apr 22 2018 8:42 AM | Updated on Jul 26 2018 7:14 PM

YS Jagan Prajasanklpayatra 142 Day Starts - Sakshi

సాక్షి, నూజివీడు : వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర కృష్ణా జిల్లా నూజివీడులో విజయవంతంగా కొనసాగుతుంది. ప్రజాసంకల్పయాత్రలో 142వ రోజు నూజివీడు శివారు నుంచి వైఎస్‌ జగన్‌ ఆదివారం ఉదయం పాదయాత్రను ప్రారంభించారు. అభిమానులు, కార్యకర్తలు జననేత వెంట అడుగులు వేస్తున్నారు. నూజివీడు నుంచి కొత్తూరు, కొన్నం గుంట మీదుగా రావచర్లకు వైఎస్‌ జగన్‌ చేరుకుంటారు. అక్కడ భోజన విరామం తీసుకుంటారు. 

పాదయాత్ర తిరిగి మధ్యాహ్నం 2.45లకు ప్రారంభమౌతుంది. వడ్లమాను మీదుగా ఆగిరిపల్లి వరకూ పాదయాత్ర కొనసాగుతుంది. రాత్రికి రాజన్నబిడ్డ ఇక్కడే బస చేస్తారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటూ.. వారికి నేనున్నా అని భరోసానిస్తూ.. జననేత పాదయాత్రలో ముందుకు సాగుతున్నారు. 


 

Advertisement
 
Advertisement
Advertisement