జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు | Will See Sharp Changes In AP Politics Says GVL | Sakshi
Sakshi News home page

జీవీఎల్‌ సంచలన వ్యాఖ్యలు

May 10 2018 6:08 PM | Updated on Mar 23 2019 9:10 PM

Will See Sharp Changes In AP Politics Says GVL - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో అనూహ్య మార్పులు చోటు చేసుకోబోతున్నాయంటూ గురువారం భారతీయ జనతా పార్టీ(బీజేపీ) అధికార ప్రతినిధి, ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వచ్చే మూడు నుంచి ఆరు నెలలలోగా ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో మార్పులు జరుగుతాయని జోస్యం చెప్పారు.

రానున్న మార్పులకు అన్ని రాజకీయ పార్టీలు సిద్ధంగా ఉండాలని తెలిపారు. కర్ణాటక ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ నేతలు విష ప్రచారం చేశారని ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్‌లో నిధుల దుర్వినియోగం జరిగిందని కాగ్‌ నిర్ధారించిందని, కాగ్‌కు కేంద్రంతో గానీ, ఏ రాజకీయ పార్టీతో గానీ సంబంధం లేదని అన్నారు.

అక్రమాలు జరిగినందుకు చంద్రబాబు ప్రభుత్వాన్ని ప్రజలే శిక్షిస్తారని పేర్కొన్నారు. రాష్ట్ర అసెంబ్లీని టీడీపీ ప్రచార వేదికగా మార్చారని ఆరోపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement