అందుకే సిట్‌ నివేదిక బయటపెట్టడం లేదు

That Is Why The SIT Report Does Not Reveal Said By CPI Ramakrishna - Sakshi

విజయనగరం: విశాఖపట్నం జిల్లాలో రూ.2500 కోట్ల భూ కుంభకోణం జరిగిందని పోరాటాలు చేస్తే సిట్‌ దర్యాప్తు చేసి సీఎం నారా చంద్రబాబు నాయుడికి ఇచ్చిందని, మరి ఆ నివేదిక ఎందుకు బయటపెట్టలేదో సీఎం సమాధానం చెప్పాలని ఏపీ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ప్రశ్నించారు.  సిట్‌ ఇచ్చిన నివేదికలో అధికార పార్టీ నేతలు ఉన్నారని..అందుకే నివేదిక బయటపెట్టడం లేదని వ్యాఖ్యానించారు. ఈ నెల 10వ తేదీ లోపు విశాఖ భూకుంభకోణంపై సిట్‌ నివేదిక బయటపెట్టాలని లేకపోతే అదే రోజు 4 గంటలకు కబ్జాదార్ల పేర్లు బయటపెడతామని హెచ్చరించారు.

విజయనగరం జిల్లా కొత్తవలస మండలం బలిఘట్టం గ్రామంలో శుక్రవారం రామకృష్ణ వివాదాస్పద భూములను పరిశీలించారు. బలిఘట్టం గ్రామంలో రూ.500 కోట్ల విలువైన 91 ఎకరాల భూమి ఆక్రమణలకు గురైందని వాఖ్యానించారు. అధికారులు, స్థానిక ప్రజాప్రతినిథులు కలిసి ఈ భూ కుంభకోణంలో భాగాస్వాములుగా ఉన్నారని చెప్పారు. 2008లో ప్రభుత్వ భూమిని ట్యాంపరింగ్‌ చేసింది అప్పటి జాయింట్‌ కలెక్టర్‌ జగన్‌మోహన్‌నేని చెప్పారు. ఈ ఘటనపై ప్రత్యేక దర్యాప్తు సంస్థతో విచారణ చేయించాలని డిమాండ్‌ చేశారు.
 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top