శ్రీకాకుళం: ఓటర్‌ లిస్ట్‌లో మీ పేరుందా? | Voters Awareness Campaign in Srikakulam Under The Leadership Of Sakshi | Sakshi
Sakshi News home page

శ్రీకాకుళం: ఓటర్‌ లిస్ట్‌లో మీ పేరుందా?

Mar 12 2019 8:56 AM | Updated on Mar 12 2019 8:58 AM

Voters Awareness Campaign in Srikakulam Under The Leadership Of Sakshi

నేషనల్‌ ఓటర్‌ సర్వీస్‌ పోర్టల్‌ (www.nvsp.in) ఓపెన్‌ చేసి అందులో పేరు కానీ, ఓటర్‌ ఐడీ కార్డు ఎపిక్‌ నంబర్‌ కానీ నమోదు చేస్తే.. ఓటుందో లేదో తెలుస్తుంది. ఓటు లేకుంటే అందులోనే నమోదు చేసుకోవచ్చు.

  • 1950 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫోన్‌ చేసి కూడా వివరాలు తెలుసుకోవచ్చు. 
  •  www.ceoandhra.nic.in వెబ్‌సైట్‌ ఓపెన్‌ చేస్తే search your name  పేరుతో ఆప్షన్‌ కనిపిస్తుంది. అందులో మీ నియోజకవర్గంలో మీ ఓటుందో లేదో మీ పేరు ఆధారంగా చెక్‌ చేసుకునే వెసులుబాటు ఉంది. 
  •  జిల్లా కలెక్టరేట్‌లోని ఎన్నికల ప్రత్యేక సెల్‌లో ఓటరు కార్డు ఎపిక్‌ నంబర్‌ వివరాలు అందిస్తే ఓటు ఉందో లేదో చెబుతారు. ఫారం–6 నింపి అక్కడే ఓటు నమోదు చేసుకోవచ్చు. 
  •  మీ–సేవ కేంద్రాల్లో నిర్ణీత మొత్తం తీసుకుని ఓటరు జాబితాలో పేరుందా? లేదా? అనే వివరాలు చెక్‌ చేసి చెబుతారు. అక్కడే ఓటు నమోదు కూడా చేసుకోవచ్చు.  
  •  గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు check your vote పేరుతో ఎన్నికల అధికారులు ప్రత్యేక శిబిరాలు నిర్వహించారు. ఓటు ఉందో లేదో సరిచూసుకోవడానికి ఇవి ఉపయోగపడ్డాయి. ఈసారి కూడా అటువంటి సౌకర్యం అందుబాటులోకి వస్తే.. వినియోగించుకోవచ్చు.
  • ఈ నెల 15వ తేదీ వరకు ఓటు నమోదుకు అవకాశం ఉంది. అధికారులను సంప్రదించి తెలుసుకోవచ్చు.
  • మీ ఓటుకు సంబంధించి ఎలాంటి సమస్యలున్నా ఈ మొబైల్‌ నంబరుకు సంప్రదించవచ్చు
  • జిల్లా కలెక్టరేట్‌లోని ఎలక్షన్‌ కంట్రోల్‌ రూం 8186923639  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement