కొంచెం ఓపిక పట్టు చిట్టి నాయుడు.. | Vijaya Sai Reddy Tweets on Pawan Kalyan, Nara Lokesh | Sakshi
Sakshi News home page

కొంచెం ఓపిక పట్టు చిట్టి నాయుడు..

Dec 2 2019 1:51 PM | Updated on Dec 2 2019 4:23 PM

Vijaya Sai Reddy Tweets on Pawan Kalyan, Nara Lokesh - Sakshi

సాక్షి, అమరావతి : జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌,  మాజీ మంత్రి నారా లోకేష్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ‘వ్యవసాయం అంటే తెలియని నటుడు... రైతుల గురించి మొసలి కన్నీరు కారుస్తున్నారు. మీ యజమాని రాజధాని పేరుతో 35వేల ఎకరాల భూమిని లాక్కుని రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారులకు అప్పగించారు. గతంలో వ్యవసాయం దండగ అని కూడా అన్నారు. వాటిపై స్పందిస్తే బాగుంటుందని’  పవన్‌కు సూచించారు.

అలాగే ‘ఐటీ మంత్రిగా ఉండగా మహిళల భద్రత కోసం కేంద్రం ఇచ్చిన రూ.58 కోట్లను చిట్టినాయుడు సింగపూర్‌కు మళ్లించేశారు. ఆటోల్లో ప్రయాణించే మహిళల భద్రత కోసం...యాప్‌ తయారికి ఖర్చు చేసినట్లు మస్కా కొట్టారు. ఇప్పుడు మహిళల భద్రతపై బెంగ నటిస్తున్నారు. రూ.58 కోట్ల కుంభకోణంపై విచారణ జరుగుతోంది. ఓపిక పట్టు చిట్టీ’ అని విజయసాయి రెడ్డి వ్యాఖ్యానించారు.


 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement