కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి | Vijaya Sai Reddy Slams Congress Party In Rajya Sabha | Sakshi
Sakshi News home page

రాజ్యసభలో కాంగ్రెస్‌పై నిప్పులు చెరిగిన విజయసాయిరెడ్డి

Jul 3 2019 7:04 PM | Updated on Jul 3 2019 7:45 PM

Vijaya Sai Reddy Slams Congress Party In Rajya Sabha - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి రాజ్యసభలో కాంగ్రెస్‌ పార్టీపై నిప్పులు చెరిగారు. నేర రాజకీయాలపై కాంగ్రెస్‌ పార్టీకి మాట్లాడతే అర్హత లేదన్నారు.ఎలక్ట్రోరల్‌ రిఫార్మ్స్‌పై బుధవారం రాజ్యసభలో జరిగిన స్వల్పకాలిక చర్చలో భాగంగా విజయసాయిరెడ్డి మాట్లాడారు. నిజమైన ప్రజాస్వామ్యానికి, సమసమాజ సాధనకు ఎన్నికల్లో సంస్కరణలు అత్యంత అవసరం అని విజయసాయిరెడ్డి తెలిపారు. ఎలక్టోరల్‌ రోల్స్‌పై పారదర్శకత, విశ్వసనీయత అవసరమని అభిప్రాయపడ్డారు. బూత్‌ లెవల్‌ అధికారులకు ఎన్నికలపై సరైన శిక్షణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. డిజిటల్‌ ఎలక్షనీరింగ్‌ జరగాలన్నారు. ప్రజాప్రాతినిధ్య చట్టానికి సవరణలు చేయాలని, ఎన్నికలకు ప్రభుత్వమే డబ్బులు ఖర్చు చేయాలని ఈ సందర్భంగా ఆయన కోరారు.

కాంగ్రెస్‌ పార్టీ రాజకీయాలను నేరమయం చేసిందన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మందబలంతో ప్రత్యర్థులను అణచివేయాలని చూసిందన్నారు. ధన బలం, కండబలంతో నేరమయమైన రాజకీయాలకు పాల్పడిందని ఆరోపించారు. 50 ఏళ్ల కాంగ్రెస్‌ పాలన చరిత్రలో ప్రత్యర్థులను వేధించడమే పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. ప్రత్యర్థులను తప్పుడు కేసుల్లో ఇరికించడంలో కాంగ్రెస్‌ పార్టీ మంచి అనుభవం సంపాదించిందని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. తప్పుడు కేసుల్లో ఇరికించి వేధింపులకు గురిచేయడమే కాకుండా నిందితులుగా బ్రాండింగ్‌ వేసేందుకు ప్రయత్నించిందని మిమర్శించారు. అయితే కాంగ్రెస్‌ గత చరిత్రపై విజయసాయిరెడ్డి మాట్లాడుతున్న సమయంలో ఆ పార్టీ ఎంపీలు జైరాం రమేశ్‌, బీకే హరిప్రసాద్‌లు అడ్డుకునే ప్రయత్నం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement