‘కరోనాను పవన్‌ రాజకీయం చేయడం సిగ్గుచేటు’

Vellampalli Srinivas Criticises Pawan Kalyan In Vijayawada - Sakshi

సాక్షి. విజయవాడ : ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రవేశపెట్టిన వాలంటీర్‌ వ్యవస్థ కరోనా కట్టడికి కొండంతా అండగా నిలుస్తుందని మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్‌ తెలిపారు. విజయవాడలోని కేఎల్‌ రావు నగర్‌లో బుధవారం పెన్షన్‌ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పెన్షన్‌ డబ్బులతోపాటు మాస్క్‌లు, శానిటైజర్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. కరోనా సోకకుండా ఇంటిపట్టునే ఉండి జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు సూచించారు. (అమలాపాల్‌ రెండో పెళ్లిపై స్పందించిన శ్రీరెడ్డి )

విపత్కర పరిస్థితిని ఎదుర్కొంటూనే పేదలకు ఇబ్బంది కలగకూడదనే అరవై లక్షల మందికి పెన్షన్లు అందజేస్తున్నామని తెలిపారు. ఆపదకాలంలో అండగా నిలవకపోగా ప్రతిపక్షాలు ఆరోపణలు చేయటం తగదన్నారు. జనసేన అధ్యక్షుడు పవన్‌ కల్యాణ్‌ కరోనాను కూడా రాజకీయం చేయటం సిగ్గుచేటన్నారు. ఇక మంత్రి స్వయంగా వచ్చి పెన్షన్‌ డబ్బు అందజేయటంతో వృద్ధులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కష్ట కాలంలో సైతం ఇంటికే పెన్షన్‌ అందజేసిన సీఎం వైఎస్‌ జగన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. (సిలిండర్‌ పేలి క్రికెటర్‌ భార్యకు గాయాలు )

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top