కుమారస్వామికి గవర్నర్‌ డెడ్‌లైన్‌

Vajubhai Vala Suggestions To Kumara Swamy On Trust Vote - Sakshi

సాక్షి, బెంగళూరు: కర్ణాటక రాజకీయం క్షణానికో మలుపు తిరుగుతూ రసవత్తరంగా మారుతోంది. తాజాగా గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా సీఎం కుమారస్వామికి కీలక సూచన చేశారు. శుక్రవారం మధ్యాహ్నం 1.30 గంటల్లోపు శాసనసభలో బలం నిరూపించుకోవాలని కుమారస్వామికి గవర్నర్‌ సూచించారు.

ఈ మేరకు గవర్నర్‌ వాజూభాయ్‌ వాలా సీఎంకు ఓ లేఖ రాశారు. అంతకుముందు విశ్వాస పరీక్షను ఈ రోజే పూర్తి చేయాలంటూ గవర్నర్‌ స్పీకర్‌కు ఓ సందేశం పంపారు. అయితే, సభలో ఆందోళన నేపథ్యంలో స్పీకర్‌ సభను శుక్రవారానికి వాయిదా వేశారు. మరోవైపు కుమార ప్రభుత్వం ప్రజల విశ్వాసాన్ని కోల్పోయిందని, బలపరీక్షకు సిద్ధం కావాలని భాజపా నేత, మాజీ ముఖ్యమంత్రి యడ్యూరప్ప డిమాండ్‌ చేశారు. ఈ కూటమికి 98 ఎమ్మెల్యేల మద్దతు మాత్రమే ఉందని, తమకు 105 మంది ఉన్నారని చెప్పారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter

Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Read also in:
Back to Top