రాహుల్‌ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా? | Union Minister Ravi Shankar Prasad Slams Congress Chief Rahul Gandhi | Sakshi
Sakshi News home page

Dec 14 2018 8:51 PM | Updated on Dec 14 2018 8:57 PM

Union Minister Ravi Shankar Prasad Slams Congress Chief Rahul Gandhi - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ : కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీపై కేంద్రమంత్రి రవిశంకర్‌ ప్రసాద్‌ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. రాహుల్‌ నోటిని అదుపులో పెట్టుకోవాలని హెచ్చరించారు. దేశ ప్రధానిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం సరికాదని హితవు పలికారు. రాఫెల్‌ డీల్‌పై విచారణ చేయలేమని సుప్రీం కోర్టు స్పష్టం చేసిన నేపథ్యంలో.. దేశానికి కాపలాదారు (చౌకీదార్‌)గా ఉంటానన్న ప్రధాని మోదీ పెద్ద దొంగ అని రాహుల్‌ మీడియా సమావేశంలో విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. (ఖర్గేకు తెలియకుండా వేరే పీఏసీ ఉందా : రాహుల్‌)

‘రాహుల్‌ తనకు తాను చాలా గొప్పగా ఊహించుకుంటున్నాడు. సుప్రీం తీర్పును గౌరవించకుండా.. దేశ ప్రధాని హోదాను కించపరిచే విధంగా మాట్లాడుతున్నాడు. చౌకబారు వ్యాఖ్యలు చేస్తున్న రాహుల్‌ నోటిని అదుపులో పెట్టుకో. రాహుల్‌ సుప్రీంకోర్టు కంటే గొప్పవాడా. కాంగ్రెస్‌ పార్టీ సుప్రీంకోర్టు కంటే కూడా గొప్పదని భావిస్తోందా. రాఫెల్‌ వ్యవహారంలో కాంగ్రెస్‌ దిక్కుమాలిన రాజకీయాలు చేయాలని  చూస్తోంది.’ అని  ధ్వజమెత్తారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement