ప్రజా సంక్షేమానికే పెద్దపీట

Trs Will Give More Priority For Public Welfare - Sakshi

సాక్షి, జహీరాబాద్‌: రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సంక్షేమానికి పెద్ద పీట వేస్తోందని జహీరాబాద్‌ ఎంపీ బీబీ పాటిల్, ఎమ్మెల్సీ ఫరీదుద్దీన్, ఎమ్మెల్యే కె.మాణిక్‌రావులు అన్నారు. శనివారం రాత్రి జహీరాబాద్‌ పట్టణంలోని పద్మశాలి కల్యాణ మండపంలో నిర్వహించిన కార్యక్రమంలో పలువురు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా డాక్టర్‌ చంద్రశేఖర్‌తో పాటు పలువురికి బీబీ పాటిల్, ఫరీదుద్దీన్, మాణిక్‌రావులు కండువా కప్పి టీఆర్‌ఎస్‌లోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సాధిస్తున్న అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్శితులై అనేక మంది టీఆర్‌ఎస్‌లోకి వచ్చి చేరుతున్నారన్నారు. దీంతో ఆయా పార్టీలు ఖాళీ అవుతున్నాయన్నారు.

జహీరాబాద్‌ ప్రాంతంలో పేరు ప్రఖ్యాతలు ఉన్న డాక్టర్‌ చంద్రశేఖర్‌ టీఆర్‌ఎస్‌లో చేరడంపై సంతోషం వ్యక్తం చేశారు. ఎన్నికల నాటికి చేరికలు మరింత ఎక్కువగా ఉంటాయని తెలిపారు. అంతకుముందు మొగుడంపల్లి మండలంలో మోటారు సైకిల్‌ ర్యాలీ, రోడ్‌షో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఆయా కార్యక్రమాల్లో రాష్ట్ర బేవరేజెస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ దేవీ ప్రసాద్, మార్కెట్‌ చైర్మన్‌ డి.లక్ష్మారెడ్డి, సీడీసీ చైర్మన్‌ ఉమాకాంత్‌ పాటిల్, ఎంపీపీ చిరంజీవిప్రసాద్, జెడ్పీటీసీ కిషన్‌రావుపవార్, పీఏసీఎస్‌ చైర్మన్‌ సంజీవరెడ్డి, టీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.శివకుమార్, ఆర్‌.దశరథ్‌రెడ్డి, మోహన్‌రెడ్డి, మురళికృష్ణాగౌడ్, మంకాల్‌ సుభాష్, జనార్ధన్‌ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top