పుదుచ్చేరిలో బీజేపీ ఎమ్మెల్యేలకు షాక్‌

Three nominated BJP MLAs denied entry into Puducherry Assembly - Sakshi

సాక్షి, చెన్నై: పుదుచ్చేరి లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కిరణ్‌ బేడీ నామినేట్‌ చేసిన ముగ్గురు బీజేపీ ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ వైద్యలింగం షాకిచ్చారు. మద్రాస్‌ హైకోర్టు ఆదేశాలతో అసెంబ్లీ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన ఎమ్మెల్యేలు వి.స్వామినాథన్, కె.జి.శంకర్, ఎస్‌.సెల్వగణపతిలను సభలోకి రాకుండా అడ్డుకున్నారు. దీంతో అసెంబ్లీలోకి దూసుకెళ్లేందుకు యత్నించిన ముగ్గురు ఎమ్మెల్యేలను మార్షల్స్‌ బయటకు ఈడ్చుకొచ్చి పడేశారు. ప్రభుత్వ వ్యవహారశైలిపై తీవ్రంగా మండిపడ్డ స్వామినాథన్‌.. స్పీకర్‌ వైద్యలింగంపై కోర్టు ధిక్కార కేసు వేయనున్నట్లు మీడియాకు తెలిపారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top