‘దేశంలో కాంగ్రెస్‌, బీజేపీల అరాచకం నడుస్తోంది’

Telanagana CM KCR Slams Congress And BJP In Manthani - Sakshi

మంథని: భారత దేశంలో ప్రస్తుతం కాంగ్రెస్‌, బీజేపీల అరాచకం నడుస్తోందని తెలంగాణ సీఎం, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా మంథని ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్‌ మాట్లాడుతూ.. ఢిల్లీలో బీజేపీ, కాంగ్రెస్‌ ప్రభుత్వాలను గద్దె దింపాలని, ఫెడరల్‌ ఫ్రంట్‌ ప్రభుత్వం తీసుకురావాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో 17 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్‌ గెలుచుకోబోతుందని జోస్యం చెప్పారు. ఈ అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణలో వంద సీట్లు టీఆర్‌ఎస్‌ గెలవబోతుందని ధీమా వ్యక్తం చేశారు.

టీఆర్‌ఎస్‌ అధికారంలోకి రాగానే ఐదారు మాసాల్లో పోడు భూములకు పట్టాలు ఇస్తామని హామీ ఇచ్చారు. అవసరమైతే రెండు రోజులు మంథనిలో ఉండి సమస్యలన్నీ పరిష్కరిస్తానని చెప్పారు. టీఆర్‌ఎస్‌కు కులం మతం జాతి లేదని, అన్ని వర్గాల ప్రజలను ఆదరిస్తుందని వ్యాక్యానించారు. 50 ఏళ్ల క్రితం కరెంటు పరిస్థితి ఎలా ఉండేది..ఇప్పుడు ఎలా ఉందో చూడాలని ప్రజలను కోరారు. కాంగ్రెస్‌, బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో రైతులకు 24 గంటల ఉచిత కరెంటు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. రైతుబంధు పథకం ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram

Tags: 



 

Read also in:
Back to Top