హెగ్డేకు కాంగ్రెస్‌ నేత సవాల్‌

Tehseen Poonawalla Dares Anant Kumar Hegde - Sakshi

న్యూఢిల్లీ: హిందూ మహిళలను తాకిన చేయి ఎవరిదైనా సరే కులమతాలకు అతీతంగా ఆ చేతిని నరికేయాల్సిందే అంటూ కేంద్ర మంత్రి అనంత్‌ కుమార్‌ హెగ్డే చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ప్రతిపక్ష పార్టీల నేతలు దీటుగా స్పందిస్తున్నారు. ప్రతి భారతీయుడిని తలదించుకునేలా చేసిన హెగ్డే కేంద్ర మంత్రిగా అనర్హుడని, ఆయనను పదవి నుంచి తొలగించాలని కాంగ్రెస్‌ పార్టీ జాతీయ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ ట్వీట్‌ చేశారు. స్కిల్‌ డెవలప్‌మెంట్‌ (నైపుణ్యాభివృద్ధి) మంత్రిగా ఉన్న అనంత్‌ కుమార్‌ హెగ్డే.. ప్రజల చేతుల నరకండి, చంపండి అంటూ వ్యాఖ్యలు చేయడం విడ్డూరంగా ఉందని ఎంఐఎం అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ మండిపడ్డారు.

హేగ్డేకు కాంగ్రెస్‌ నాయకుడు తెహసీన్‌ పొనవల్లా ట్విటర్‌ వేదికగా సవాల్‌ విసిరారు. హిందువైన తన భార్యను ఆలింగనం చేసుకున్న ఫొటోను ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘చూడండి నా చేతులు హిందువైన నా భార్యను తాకాయి. ఏం చేస్తారో చేసుకోండి. మీకు ఇదే నా సవాల్‌’ అంటూ కామెంట్‌ పెట్టారు. (‘ముస్లిం మహిళ వెనుక పరిగెత్తడం మాత్రమే తెలుసు’)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top