‘టీడీపీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు’

TDP MLAs Tuch with Bjp says Vishnuvardhanreddy - Sakshi

సాక్షి, అమరావతి : టీడీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ.. ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ ఉపాధ్యక్షుడు విష్ణువర్ధన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 'మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు టీడీపీకి గుడ్ బై చెప్పి బీజేపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారు. ఎవరిని చేర్చుకోవాలన్న దానిపై కసరత్తు జరుగుతోంది. త్వరలో టీడీపీ భూస్థాపితం ఖాయం. ఎన్నికల్లో ఓటమితో టీడీపీ ఎదురుదెబ్బ తగిలింది. రాబోయే కాలంలో ఊహించని విధంగా ఇంకా పెద్ద దెబ్బ టీడీపీకి తగులుతుంది. ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్‌ పార్టీకి ప్రత్యామ్నాయం బీజేపీ మాత్రమే. చంద్రబాబునాయుడు, లోకేష్ అవినీతిపై వైఎస్ జగన్ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం సమగ్ర విచారణ జరపాలి' అని విష్ణువర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter


Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top