ఓటమి భయంతోనే డబ్బుల పంపిణి : అనిల్‌ కుమార్‌ | TDP Leaders Distributing Money To Voters Nellore | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే డబ్బుల పంపిణి : అనిల్‌ కుమార్‌

Mar 24 2019 3:48 PM | Updated on Mar 24 2019 5:26 PM

TDP Leaders Distributing Money To Voters Nellore - Sakshi

మీడియాతో మాట్లాడుతున్న అనిల్‌ కుమార్‌ యాదవ్‌

సాక్షి, నెల్లూరు: వచ్చే అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల్లో ఓడిపోతామనే భయంతోనే నెల్లూరు టీడీపీ అభ్యర్థి మంత్రి నారాయణ ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారని వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మండిపడ్డారు. ఆదివారం దేలుగుదేశం పార్టీ నాయకులు చిన్న బజారులో రు. 50 లక్షలు పంచుతుండగా వైఎస్సార్‌సీపీ నేతలు, స్థానికులు పటుకునేందుకు ప్రయత్నించగా డబ్డు సంచులు పడవేసి పరారైన ఇద్దరు టీడీపీ నేతులు. సంచుల్లో సుమారు రు. 15 లక్షలు నగదును పోలీసులకు అప్పగించారు.

అనంతరం వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే అనిల్‌ కుమార్‌ యాదవ్‌ మాట్లాడుతూ... మంత్రి నారాయణ డబ్బుతో ఓటర్లను కొనేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉండే ప్రాంతాలను ఎంచుకుని డబ్బులు పంపిణి చేస్తున్నారని అన్నారు. జిల్లాలో నారాయణ విద్యాసంసస్థల సిబ్బంది డబ్బులు పంపిణిలో కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ నేతలపై ప్రభుత్వ అధికారులు స్పందించి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement