రెచ్చిపోయిన పచ్చమూక | TDP Leaders Conflicts in Re polling Chandragiri Constituency | Sakshi
Sakshi News home page

రెచ్చిపోయిన పచ్చమూక

May 17 2019 7:16 AM | Updated on Sep 18 2019 2:52 PM

TDP Leaders Conflicts in Re polling Chandragiri Constituency - Sakshi

చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డిని అడ్డుకుంటున్న పోలీసులు

తిరుపతి రూరల్‌: చిత్తూరు జిల్లా చంద్రగిరి నియోజకవర్గంలో ఐదు బూత్‌ల్లో రీపోలింగ్‌ నిర్వహించాలని ఎన్నికల సంఘం ఆదేశించడాన్ని అధికార తెలుగుదేశం పార్టీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఓటమి భయంతో అరాచకాలకు పాల్పడుతున్నారు. రామచంద్రాపురం మండలం ఎన్‌ఆర్‌ కమ్మపల్లి దళిత వాడలపై గురువారం రాత్రి టీడీపీకి చెందిన రౌడీమూకలు దౌర్జన్యం చేశాయి. వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీకి మద్దతుగా పని చేస్తున్నారంటూ కాలనీకి చెందిన ధనరాజ్, సాయి, హరీష్, లవకుమార్, అమ్ములుపై దౌర్జన్యం చేశారు. మమ్మల్ని కాదని వేరే పార్టీకి ఎలా పనిచేస్తారంటూ కర్రలు, రాడ్లతో దాడులకు తెగబడ్డారు. టీడీపీకి కాకుండా వేరే పార్టీకి ఓటేస్తే చంపేస్తామని హెచ్చరించారు. టీడీపీ నేతల దాడిలో నలుగురు దళితులు గాయపడ్డారు. తమపై దాడిచేసి, కులం పేరుతో దూషిం చిన ఎన్‌ఆర్‌ కమ్మపల్లికి చెందిన జనార్దన్‌ చౌదరి, అనిల్, సుబ్రహ్మణ్యం, గోవర్దన్‌లపై వెంటనే చర్యలు తీసుకోవా లని బాధితులు డిమాండ్‌ చేశారు.

మా ఊళ్లోకి రావొద్దు
కమ్మపల్లిలో ఎన్నికల ప్రచారంలో ఉన్న చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఎన్‌ఆర్‌ కమ్మపల్లిలో దళితులపై దాడి చేసిన విషయం తెలుసుకుని బాధితులను పరామర్శించేం దుకు ఆ గ్రామానికి వెళ్లడానికి బయల్దేరారు. ఆయనను అక్కడికి వెళ్లనివ్వకుండా డీఎస్పీ శివరామ్‌ కారును తీసు కొచ్చి చెవిరెడ్డి వాహనానికి అడ్డంగా పెట్టారు. ఎస్పీ ఆదే శాల మేరకు ఎన్‌ఆర్‌ కమ్మపల్లి గ్రామానికి వెళ్లవద్దని చెప్పా రు. దీంతో చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి తన వాహనాన్ని వదిలిపెట్టి అక్కడి నుంచి వేరే మార్గంలో మోటార్‌ సైకిల్‌పై ఎన్‌ఆర్‌ కమ్మపల్లె చేరుకున్నారు. కానీ, ఆయనను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ నేతలు అడ్డుకున్నారు. ‘మా ఊళ్లోకి వేరే ఊరోళ్లు రావొద్దు. పరామర్శించడానికి చెవిరెడ్డి ఎవరు’ అంటూ బెదిరింపులకు దిగారు.

ఎమ్మెల్యేగా, ఓ పార్టీ అభ్యర్థిగా గ్రామంలోకి వెళ్లేందుకు తనకు హక్కుందని, అడ్డుకోవ ద్దంటూ చెవిరెడ్డి విన్నవించారు. అయినా పచ్చమూక ఆయ నను గ్రామంలోకి అడుగుపెట్టనివ్వలేదు. దీంతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. విషయం తెలుసుకున్న అర్బన్‌ ఎస్పీ అన్బురాజన్‌ ఎన్‌ఆర్‌ కమ్మపల్లికి చేరుకున్నారు. ఎమ్మె ల్యేని అడ్డుకోవద్దని సూచించారు. అయినా టీడీపీ నేతలు లెక్కచేయలేదు. కర్రలు పట్టుకుని హల్‌చల్‌ చేస్తున్న టీడీపీ వారిని పోలీసులు కనీసం పక్కకు తప్పించే  ప్రయత్నం కూడా చేయకపోవడం గమనార్హం. బాధితులను పరామ ర్శించడానికి వెళ్లేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే చెవిరెడ్డిపై, వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో చెవిరెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఎమ్మె ల్యేను పోలీసులు అక్రమంగా అరెస్ట్‌ చేసి, రేణిగుంట పోలీస్‌ స్టేషన్‌కు తరలించారు. పోలీసుల తీరుపై వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement