తెలుగు తమ్ముళ్ల వీరంగం

TDP Leaders Conflict In Meeting PSR Nellore - Sakshi

కావలి ఎమ్మెల్యే ప్రసంగాన్నిఅడ్డుకున్న వైనం

కావలి: తెలుగు తమ్ముళ్లు బుధవారం వీరంగం సృష్టించారు. వివరాలు.. కావలి పట్టణంలో కొత్తగా మంజూరైన పింఛన్లు లబ్ధిదారులకు పంపిణీ చేసే కార్యక్రమాన్ని మున్సిపల్‌ అధికా రులు బుధవారం స్థానిక రైల్వేరోడ్డులోని కారోనేషన్‌ రీడింగ్‌ రూం ఆవరణలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి, టీడీపీ నాయకుడైన మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్‌రావు, వైఎస్సార్‌సీపీ, టీడీపీ కౌన్సి లర్లు, నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రామిరెడ్డి ప్రతాప్‌కుమార్‌రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ వైఖరి వల్ల పేద ప్రజలు నాలుగేళ్లుగా నలిగిపోయారని అన్నారు. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్ప డు 6000 మందికి ఇంటి స్థలాలు, ఇళ్లు నిర్మించి ఇచ్చారని, టీడీపీ ప్రభుత్వం ఇంటి స్థలాలు ఇవ్వకుండా అపార్ట్‌మెంట్లు నిర్మించి అధిక ధరలకు అందులోని ప్లాట్లను అంటగట్టి అప్పులపాలు చేస్తోందన్నారు.

కావలి పట్టణంలో 4,500 మంది స్వయం ఉపాధి బ్యాంక్‌ రుణాల కోసం దరఖాస్తులు చేసుకుంటే, కేవలం 578 మంది టీడీపీ కార్యకర్తలకు మాత్రమే రుణాలు ఇవ్వడమేమిటని ప్రశ్నించారు. దీంతో వేదికపై ఉన్న టీడీపీ నాయకుడి వద్ద మెప్పు పొందుదామనుకున్న యావతో టీడీపీ కౌన్సిలర్లు, నాయకులు ఎమ్మెల్యే ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అయితే తాను మాట్లాడేది నిజం కాదా అని ఎమ్మెల్యే అనడంతో ప్రజలు నిజమేనని నినదించారు. దీంతో టీడీపీ నాయకులు చెలరేగిపోయారు. వారిని వైఎస్సార్‌సీపీ నాయకులు కూడా ఎదుర్కొన్నారు. టీడీపీ నాయకుల ఘర్షణ విధానాన్ని అనుసరిస్తున్నందుకు నిరసనగా ఎమ్మెల్యే తాము కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రకటించి వెళ్లిపోయారు. ఆయనతోపాటు వైఎస్సా ర్‌ సీపీ నాయకులు కూడా వెళ్లిపోయారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top