‘ఉత్తరం’లో నూతనోత్సాహం 

TDP And Janasena Leaders Joins YSRCP - Sakshi

కేకే రాజు సమక్షంలో టీడీపీ, జనసేన నాయకుల చేరిక 

పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన ఎంవీవీ, వంశీకృష్ణ 

సీతమ్మధార(విశాఖ ఉత్తర): జీవీఎంసీ ఎన్నికలు దగ్గర పడుతుండడంతో ప్రతిపక్ష పార్టీల నేతలు అధికార పార్టీ వైపు చూస్తున్నారు. టీడీపీ, జనసేన పార్టీల నుంచి అధిక సంఖ్యలో నాయకులు వైఎస్సార్‌సీపీలోకి వలస బాట పడుతున్నారు. 38, 39 వార్డులకు చెందిన జనసేన, టీడీపీ నాయకులు అల్లు శంకరరావు, అల్లు సత్యశ్రీ, బాపునాయుడు, చిరికి వెంకటరావు, లెక్కల ప్రకాశమ్మతో పాటు 500 మంది ఆదివారం పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త కేకే రాజు సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. దీంతో విశాఖ ఉత్తర నియోజకవర్గ పరిధిలో వైఎస్సార్‌సీపీలో నూతనోత్సాహం నెలకొంది. ముఖ్యఅతిథులుగా హాజరైన విశాఖ ఎంపీ ఎంవీవీ సత్యనారాయణ, పార్టీ నగర అధ్యక్షుడు వంశీకృష్ణ శ్రీనివాస్‌ వారికి పార్టీ కండువా కప్పి ఆహా్వనించారు.

 ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేయాలన్నారు. కార్పొరేషన్‌ ఎన్నికల్లో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ క్లీన్‌ స్వీప్‌ చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా పాలన వికేంద్రీకరణకు ప్రజలు మద్దతు పలుకుతుంటే, చంద్రబాబు అర్థపర్థంలేని రాద్ధాంతం చేస్తున్నారని మండి పడ్డారు. మూడు రాజధానులతో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి జరగడం చంద్రబాబుకు ఇష్టం లేక రాక్షసత్వాన్ని ప్రదర్శిస్తున్నారని విమర్శించారు. రాబోయే జీవీఎంసీ ఎన్నికల్లో గెలుపు కోసం సైనికుల్లా పనిచేయాలని పిలుపునిచ్చారు. కేకే రాజు మాట్లాడుతూ ప్రజలను తన మాటల గారడీతో బురిడీ కొట్టించాలని చంద్రబాబు చూస్తున్నారన్నారు.

పాలన రాజధానిగా విశాఖను ఎంపిక చేయడంతో ఉత్తరాంధ్ర మరింత అభివృద్ధి చెందుతుందన్నారు. వంశీకృష్ణ మాట్లాడుతూ అమరావతి విషయంలో పలు కమిటీలు ఇచ్చిన నివేదికలను బుట్టదాఖలు చేసి గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు అక్షరాలా ఐదు వేల కోట్ల రూపాయలు ఖర్చు చేసి సినిమా సెట్టింగ్‌లతో రాష్ట్ర ప్రజలకు భ్రమరావతి చూపించారన్నారు. ఈ విషయం తెలుసుకున్న రాష్ట్ర ప్రజలు గత ఎన్నికలలో టీడీపీని ఘోరంగా ఓడించి బుద్ధి చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి చొక్కాకుల వెంకటరావు, నాయకులు కిరణ్‌రాజు, ఆళ్ల శివగణేష్‌ బొడ్డు ఎర్రునాయుడు, ఎన్‌.రవికుమార్, పరదేశి నాయుడు, చంద్రమౌళి, చొక్కాకుల రామకృష్ణ, ఆదిరెడ్డి అప్పారావు, బి.నాయుడు, సురేష్‌ కోటకుల కుమార్, బగాది విజయ్, స్వరూప్, రామారావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు. (యాంకర్స్‌తో టీడీపీ నేత డాన్స్‌.. వీడియో వైరల్‌)

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top