‘చంద్రబాబు.. బీజేపీకి గౌరవ కార్యదర్శి’

Somu Veerraju Setires On AP CM Chandrababu Naidu - Sakshi

సాక్షి, విశాఖపట్నం : ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు మంత్రి నారా లోకేష్‌లకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ ఎమ్మెల్సీ సోము వీర్రాజు అన్నారు. ఏ ప్రయోజనం లేని నవనిర్మాణ దీక్షల కారణంగా ఏపీలో వారం రోజులుగా ప్రభుత్వ పాలన నిలిచిపోయిందన్నారు. ఆయన విశాఖలో శుక్రవారం ఇక్కడి మీడియాతో మాట్లాడారు. నవనిర్మాణ దీక్షలకు రూ.50 కోట్లు వృథా చేశారని ఏపీ ప్రభుత్వాన్ని విమర్శించారు. సీఎం చంద్రబాబు, నారా లోకేష్‌లు భయపడుతున్నారేమో గానీ, బీజేపీకి ఎలాంటి భయాలు లేవని స్పష్టం చేశారు. 

అవినీతి ఆరోపణలు ఉన్న కాంగ్రెస్‌ పార్టీతో కలవాలని చంద్రబాబు ఎందుకు అనుకుంటున్నారో చెప్పాలన్నారు. నిత్యం ప్రధాని పదవిని వదులుకున్నానని గొప్పలు చెప్పుకునే చంద్రబాబును ప్రధానిని చేస్తానని ఎవరు
చెప్పారని ఈ సందర్భంగా ఏపీ సీఎంను ఆయన ప్రశ్నించారు. జన్మభూమి కమిటీలు చెబితేనే పెన్షన్లు ఇస్తున్నారని, అర్హులకు ఇళ్లు కూడా ఇవ్వడం లేదని మండిపడ్డారు. తెల్లవారి లేచిన దగ్గరి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నామస్మరణ చేస్తూ బీజేపీకి చంద్రబాబు గౌరవ ప్రచార కార్యదర్శిగా మారారని పేర్కొన్నారు. బీజేపీ నేతలపై దాడులకు నిరసనగా ఈ నెల 11న విజయవాడలో ధర్నా చేపట్టనున్నట్లు సోము వీర్రాజు వెల్లడించారు.

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top