
మాజీ సీఎం సిద్ధరామయ్య
కర్ణాటక , శివాజీనగర: బీజేపీవారు ఆపరేషన్ కమల జరుపటం నిజమే. ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ధనాశ చూపిన ఆధారాలు తమవద్ద ఉన్నాయని, దీనిని తగిన సమయంలో బహిరంగపరుస్తామని మాజీ ముఖ్యమంత్రి సిద్ధరామయ్య తెలిపారు. గురువారం వి«ధానసౌధలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ... బీజేపీవారు ఒక్కొక్క ఎమ్మెల్యేకు రూ.30 కోట్లు డబ్బు ఆశ చూపారని, తమలో కూడా కొందరు సొమ్ము పుచ్చుకొని ఉండవచ్చు. ఏమైనా కూడా ఎవ్వరూ బీజేపీలోకి వెళ్లరని తెలిపారు. ఎమ్మెల్యేలంతా శుక్రవారం జరిగే శాసనసభా పక్ష సమావేశంలో పాల్గొంటారన్నారు.
బీజేపీవారికి ప్రజాస్వామ్య వ్యవస్థపై నమ్మకం లేదని, వారు డోంగీలు అని ధ్వజమెత్తారు. బీజేపీకి సత్తా ఉంటే ప్రభుత్వానికి వ్యతిరేకంగా అవిశ్వాస నిర్ణయం తీసుకురావాలని సవాల్ విసిరారు. ఇంగ్వ తిన్న మంగణ్ణలా బీజేపీవారు ఆడుతున్నారు. వారు ఏమి చేసినా కూడా కాంగ్రెస్ ఎమ్మెల్యేలను స్వాధీనపరచుకోవటానికి సాధ్యం లేదన్నారు. బీజేపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తూ, ప్రతి ఎమ్మెల్యేకు రూ.30–40 కోట్లు ఆశలు చూపిందని చెప్పి సిద్ధరామయ్య, ఈ భారీ స్థాయి సొమ్ము బీజేపీవారికి ఎక్కడ నుంచి వచ్చిందని ఆగ్రహంతో ప్రశ్నించారు. కాంగ్రెస్‌కు చెందిన ఏ ఎమ్మెల్యే ఎక్కడికి వెళ్లలేదని, బీజేపీ ఆశలకు లొంగలేదన్నారు. ప్రభుత్వాన్ని కూల్చటానికి బీజేపీ ఆడిన ఆట విజయవంతం కాదు. బీజేపీ ప్రయత్నం విఫలమైందని సిద్ధరామయ్య తెలిపారు.