శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ | Shivaji needs to change his behaviour: BJP | Sakshi
Sakshi News home page

శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలి: బీజేపీ

Feb 22 2018 7:16 PM | Updated on Aug 17 2018 2:27 PM

Shivaji needs to change his behaviour: BJP - Sakshi

బీజేపీ నేత విష్ణువర్దన్‌ రెడ్డి, నటుడు శివాజీ

విజయవాడ: కమెడియన్ శివాజీ చిల్లర వేషాలు మానుకోవాలంటూ బీజేపీ నేత విష్ణువర్దన్‌ రెడ్డి వ్యంగ్యంగా విమర్శించారు. విజయవాడ బీజేపీ కార్యాలయంలో విష్ణువర్దన్‌ రెడ్డి విలేకరులతో మాట్లాడారు.  సినీ నటుడు శివాజీ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీపై విమర్శలు  చేయడాన్ని ఖండిస్తున్నామన్నారు. ప్రచారం కోసమే శివాజీ బీజేపీ కార్యకర్తలు దాడి చేశారని చెబుతున్నారని వ్యాఖ్యానించారు. కొంతమంది తమ స్వార్థం కోసం దేశాన్ని విడగొట్టాలని మాట్లాడుతున్నారని..అలాగే కొంతమంది ఎంపీలు ఢిల్లీలో నాటకాలు ఆడుతున్నారని మండిపడ్డారు. 

కేంద్రంలో బీజేపీ ఉంది కాబట్టి ఏపీకి న్యాయం జరుగుతుందని చెప్పారు. టీడీపీ నాయకులకు ఇచ్చిన నిధులపై అనుమానం ఉంటే సమాధానం చెబుతామని తెలిపారు. కొంతమంది మేధావులు హైదరాబాద్‌లో ఉండి బీజేపీపై విమర్శలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. రేపు రాయలసీమ బీజేపీ ముఖ్య నాయకులంతా కర్నూలులో సమావేశమవుతున్నామని తెలిపారు. రాయలసీమ అభివృద్ధికి సంబంధించి రేపు డిక్లరేషన్ ప్రకటిస్తామని వెల్లడించారు.
 

Advertisement
 
Advertisement
Advertisement