ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు : శివసేన | Shiv Sena says outcome of assembly elections is a clear message to BJP | Sakshi
Sakshi News home page

ఈ ఫలితాలు బీజేపీకి చెంపపెట్టు : శివసేన

Dec 11 2018 4:20 PM | Updated on Dec 11 2018 4:20 PM

Shiv Sena says outcome of assembly elections is a clear message to  BJP - Sakshi

బీజేపీ ఆత్మపరిశీలన చేసుకోవాలి : శివసేన

సాక్షి, న్యూఢిల్లీ : ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు బీజేపీకి స్పష్టమైన సంకేతం పంపాయని, పాలక సంకీర్ణం ఈ ఫలితాలను విశ్లేషించుకోవాలని శివసేన పేర్కొంది. బీజేపీ విజయపరంపరకు అడ్డుకట్ట పడిందని ఈ ఫలితాలు ప్రతిబింబిస్తున్నాయని రాజ్యసభ ఎంపీ, శివసేన ప్రతినిధి సంజయ్‌ రౌత్‌ వ్యాఖ్యానించారు.

ఎన్డీఏ కూటమి ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన తరుణం ఇదని ఆయన పేర్కొన్నారు. ఎన్డీఏలో శివసేన మిత్రపక్షంగా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. రాజస్ధాన్‌, చత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో పాలక బీజేపీ ప్రతికూల ఫలితాలు ఎదురవగా, మూడు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ దిశగా ఆధిక్యం కనబరుస్తోంది. తెలంగాణలో అధికార టీఆర్‌ఎస్‌ మరోసారి పాలనాపగ్గాలు చేపట్టేలా అఖండ విజయం సాధించగా, మిజోరంలో పాలక కాంగ్రెస్‌ను మట్టికరిపించి మిజో నేషనల్‌ ఫ్రంట్‌ స్పష్టమైన మెజారిటీ సాధించింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement