వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అధికారం | shabbir sawal to kcr | Sakshi
Sakshi News home page

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌కే అధికారం

Feb 9 2018 2:02 AM | Updated on Mar 18 2019 9:02 PM

shabbir sawal to kcr - Sakshi

నిజాంసాగర్‌ (జుక్కల్‌): ‘వచ్చే ఎన్నికల్లో కాం గ్రెస్‌ పార్టీ అధికారంలోకి రాకపోతే నేను రాజకీయాల నుంచి తప్పుకుంటా.. వంద సీట్లకు పైగా వస్తాయని కేసీఆర్‌ అంటున్నాడు గదా.. మరీ అన్ని సీట్లు రాకుంటే టీఆర్‌ఎస్‌ పార్టీని మూసేస్తారా?’ అని శాసనమండలిలో కాంగ్రెస్‌ పక్ష నేత షబ్బీర్‌ అలీ సవాల్‌ విసిరారు. కామారెడ్డి జిల్లా నిజాంసాగర్‌లో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు.

‘కేటీఆర్‌.. కాంగ్రెస్‌ పార్టీని లోఫర్‌ పార్టీ అన్నావ్‌.. నీ తండ్రి కేసీఆర్‌ యూత్‌ కాంగ్రెస్‌ ఉపాధ్యక్షుడిగా రాజకీయాల్లోకి అడుగు పెట్టాడు. మరీ కేసీఆర్‌ కొడుకువు కాబట్టి, కేసీఆర్‌ కాంగ్రెస్‌వాడు కాబట్టి నీ తండ్రి పెద్ద లోఫర్, నీవు చిన్న లోఫర్‌ కాదా’అని విమర్శించారు. ‘ఉద్యమం చేసినప్పుడు అమెరికాలో ఉన్నావ్‌... ఇవాళ వచ్చి లోఫర్‌ పార్టీ అని చెప్తావ్‌.. ఆగు బిడ్డా నాల్గు దినాలైతే చెంప వాయించే సమయం వస్తుంది’ అని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement