
సాక్షి, అమరావతి : రానున్న ఎన్నికల్లో డిపాజిట్లు వస్తాయో లేదో అన్నభయంతో టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు నాయుడు తమ పార్టీ సానుభూతిపరుల ఓట్లను తొలగిస్తున్నారని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డి ఆరోపించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు మరోసారి అబద్ధాలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరారు.
ఆరు నెలల క్రితమే వైఎస్ జగన్ ప్రకటించిన పథకాలను చంద్రబాబు కాపీ కొడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓట్ల తొలగింపు విషయంలో బూత్ లెవెల్ కమిటీ సభ్యులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎన్నికలు దగ్గరలోనే ఉన్నాయని.. అందరి సలహాలు తీసుకొని ముందుకెళ్తామని చెప్పారు. ఈ నెల 13న ఒంగోలులో జరగనున్న బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి వైఎస్ జగన్ హాజరవుతారని వెల్లడించారు. పార్టీలో ఉన్న లోపాలను సరిదిద్దుకొని.. అత్యధిక మెజారిటీయే లక్ష్యంగా ముందుకు వెళ్తామని సజ్జల పేర్కొన్నారు.