కాంగ్రెస్‌ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌ నేతలు పరిగలు ఏరుకోవాల్సిందే

Published Thu, May 17 2018 5:10 AM

Rythu Bandhu scheme is historic - Sakshi

సాక్షి, సిద్దిపేట: ‘సీఎం కేసీఆర్‌ స్వయానా రైతు బిడ్డ. అందుకోసమే రైతును రాజుగా చూడాలని సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. ప్రభుత్వం వర్షాకాలానికి ముందుగా ఎకరానికి రూ.4 వేల పెట్టుబడి సహాయం అందిస్తోంది. దీంతో రైతులు ఎరువులు, విత్తనాల కోసం వడ్డీ వ్యాపారుల వద్ద అప్పులు చేసే దుస్థితి తప్పింది. ఇంత మంచి పని చేసిన కేసీఆర్‌ నాయకత్వాన్ని ప్రజలు సమర్థి స్తున్నారు. ప్రతిచోట బ్రహ్మరథం పడుతున్నారు. ఇక కాంగ్రెస్‌ నాయకులు వచ్చే ఎన్నికల్లో పరిగలు ఏరుకోవడం మినహా.. చేసేది ఏమీ లేదు’అని రాష్ట్ర నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. బుధవారం సిద్దిపేట నియోజకవర్గం రంగధాంపల్లి, గజ్వేల్‌ నియోజకవర్గం బూరుగుపల్లిలో రైతుబంధు పథకం చెక్కుల పంపిణీ కార్యక్రమంలో మంత్రి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ.. రైతుబంధు పథకంతో ప్రజలు గ్రామగ్రామాన పండగ జరుపుకుంటున్నారని, సాగుకు ముందే సహాయం అందడంతో రైతు లు ఆనందం వ్యక్తం చేస్తున్నారన్నారు. ప్రభు త్వం మద్దతు ధర, నిరంతర విద్యుత్, పెట్టుబడి సహాయం అందించడంతో పాటు సాగునీరిచ్చేందుకు కష్టపడుతోందని చెప్పారు.
 

Advertisement

తప్పక చదవండి

Advertisement