ఎన్నికల కోసమే ‘రైతుబంధు’    

Rythu Bandhu For The Election : YSRCP - Sakshi

 రాష్ట్ర వైఎస్సార్‌సీపీ యూత్‌ అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్‌

నాలుగేళ్ల తర్వాత రైతులు గుర్తొచ్చారా అని ప్రభుత్వానికి ప్రశ్న

జగన్‌ పాదయాత్ర రెండు వేల కి.మీ చేరిన సందర్భంగా పూజలు

జోగిపేట(అందోల్‌) సంగారెడ్డి : ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతు బంధు పథఖం ప్రవేశపెట్టిందని, ఎన్నికల తర్వాత ఈ పథకం రద్దు కావడం ఖాయమని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర యూత్‌ అధ్యక్షులు వెల్లాల రాంమోహన్‌ అన్నారు. సోమవారం రాష్ట్ర వైఎస్సార్‌సీపీ ప్రధాన కార్యదర్శి బి.సంజీవరావుతో కలిసి ఆయన మాట్లాడుతూ..నాలుగేళ్లుగా గుర్తుకు రాని రైతులు ఎన్నికలు దగ్గర పడగానే గుర్తుకు వచ్చాయా? అంటూ టీఆర్‌ఎస్‌ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పథకాలతో ప్రజలను తప్పుదోవ పట్టించడం కేసీఆర్‌కు అలవాటైందని విమర్శించారు.

ఎన్నికల సమయంలో చేసిన వాగ్దానాలను నిలబెట్టుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ పార్టీ బలోపేతం కావడం ఖాయన్నారు. జూలై మాసంలో తెలంగాణ రాష్ట్రంలో బస్‌యాత్రను భారీ ఎత్తున నిర్వహిస్తామని తెలిపారు. అందుకు రూట్‌మ్యాప్‌ కూడా సిద్ధమవుతుందన్నారు. 

జోగిపేటలో పూజలు

వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్ర నేటికి 2వేల కి.మీ పూర్తి చేసుకున్న సందర్బంగా జోగిపేటలోని పబ్బతి హనుమాన్‌ మందిరంలో ఆ పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర వైఎస్సార్‌సీపీ యూత్‌ అధ్యక్షుడు వెల్లాల రాంమోహన్‌ , రాష్ట్ర పార్టీ ప్రధాన కార్యదర్శి బీ. సంజీవరావు, మండల పార్టీ అధ్యక్షుడు జీ.శంకర్, జిల్లా యూత్‌ విభాగం వర్కింగ్‌ ప్రసిడెంట్‌ బాగయ్య, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి పవన్, పట్టణ అధ్యక్షుడు రాకేష్, ఉమ్మడి జిల్లా వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు జీ.నరేష్, జిల్లా నాయకులు రమేశ్, బీసీ సెల్‌ అధ్యక్షుడు గురు ప్రసాద్‌ పాల్గొన్నారు.

వైసీపీ నేతల పూజలు

పటాన్‌చెరు టౌన్‌: వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర రెండు వేల కిలోమీటర్లను పూర్తి చేసుకున్న సందర్భంగా ఆ పార్టీ నేతలు సోమవారం సంబరాలు నిర్వహించారు. పటాన్‌చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ ఆధ్వర్యంలో పట్టణంలోని మహంకాళీ అమ్మవారి ఆలయంతోపాటూ,గణేష్‌ గడ్డలో ఉన్న గణనాధుని ఆలయంలో జగన్‌ సీఎం ఆకావాలని ఆకాంక్షిస్తూ ప్రత్యేక పూజలు నిర్వహించారు.

ఈ సందర్భంగా వైసీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్‌ చంద్రశేఖర్‌ మాట్లాడుతూ..దివంగత సీఎం వైఎస్‌ఆర్‌ తనయుడిగా, ఆయన అడుగుజాడల్లో పయనిస్తూ, ప్రజల సంక్షేమం కోసం నిరంతరం పాటుపడుతున్న వైఎస్‌ జగన్‌ చేపట్టిన పాదయాత్ర రెండువేల కిలోమీటర్లు పూర్తి చేసుకోవడం సంతోషకరమన్నారు. జగన్‌ పాద యాత్రకు ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోందన్నారు.

2019 ఎన్నికల్లో వైస్‌ జగన్‌ ఏపీ సీఎం కావడం ఖాయమన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ నాయకులు విక్రమ్‌ రెడ్డి, రాజు, చైతన్య, సుబ్బారెడ్డి, గోవర్ధన్, శేషు, సురేష్, వెంకటరమణ పాల్గొన్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top