‘తుంగతుర్తి టికెట్‌పై పునరాలోచించాలి’ | revisit of tungaturthi ticket | Sakshi
Sakshi News home page

‘తుంగతుర్తి టికెట్‌పై పునరాలోచించాలి’

Sep 27 2018 5:15 AM | Updated on Sep 27 2018 5:15 AM

revisit of tungaturthi ticket - Sakshi

సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘2001 నుంచి ఇప్పటి వరకు తుంగతుర్తి నియోజకవర్గంలో పార్టీ నాయకుడిగా తెలంగాణ కోసం ఉద్యమించా.. పార్టీని నియోజకవర్గంలో నేనే బలోపేతం చేశా.. తుంగతుర్తి నియోజకవర్గ టికెట్‌ విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌ పునరాలోచించాలి. నాకు టికెట్‌ ఇస్తే అత్యధిక మెజార్టీ తో గెలుస్తా’అని టీఆర్‌ఎస్‌ నేత, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్‌ మందుల సామేల్‌ అన్నారు. బుధవారం ఆయన హైదరాబాద్‌ నుంచి సూర్యాపేట జిల్లా తుంగతుర్తి వరకు తన అనుచరులతో కలసి కార్లతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా పలు చోట్ల టీఆర్‌ఎస్‌ శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. 2014లో ఓయూ నేతకు టికెట్‌ ఇస్తే కేసీఆర్‌ ఆదేశాల మేరకు ఆ అభ్యర్థి విజయం కోసం కృషి చేశానన్నారు. తాను ఎప్పటికీ కేసీఆర్‌ వెంటే ఉంటానని, టికెట్‌ విషయంలో పునరాలోచించాలని అన్నారు. ర్యాలీలో నియోజకవర్గ ముఖ్య నేతలు, ఎంపీటీసీలు, మాజీ సర్పంచ్‌లు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement