లక్షలకు లక్షలు ఎందుకు ఇస్తున్నారు? | Revanth Reddy Fires On KCR | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌ దొంగల బండిలా మారింది : రేవంత్‌

Aug 30 2019 4:38 PM | Updated on Aug 30 2019 8:19 PM

Revanth Reddy Fires On KCR - Sakshi

సాక్షి, రాజన్న సిరిసిల్ల : పరీహారం అందక మిడ్‌మానేరు నిర్వాసితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ముఖ్యమంత్రి కేసీఆర్‌ పట్టించుకోవడం లేదని కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల్లో అండగా నిలిచిన ప్రజలను టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం మోసం చేస్తుందని మండిపడ్డారు. శుక్రవారం ఆయన మిడ్‌మానేరు నిర్వాసితుల బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌రెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్‌ ముఖ్యమంత్రి అయితే కష్టాలు తీరుతాయని భావించి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలకు  ఆయన అన్యాయం చేస్తున్నారని విమర్శించారు. ఊర్లను మానేర్‌లో ముంచి కేసీఆర్‌ మూటలు దోచుకుంటున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ అవినీతిని ప్రశ్నిస్తే తెలంగాణ ద్రోహి అంటున్నారని మండిపడ్డారు.

‘మిడ్‌మానేరు నిర్వాసితులు ఇల్లు కట్టుకునేందుకు రూ. ఐదు లక్షల నాలుగు వేలు, 18 ఏళ్లు నిండిన వారికి రూ.2లక్షలు, ఇళ్ల స్థలాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటి వరకూ నెరవేర్చలేదు కానీ కానీ ఆయన సొంత గ్రామం చింతమడకకు మాత్రం ప్రతి ఇంటికి రూ.10 లక్షలు ఇస్తానంటున్నారు. చింతమడకకు ఏమైందని లక్షలకు లక్షలు ఇస్తున్నారు? నష్ట పరిహారం చెల్లించేందుకు నీ బంధువలు తప్ప ముంపు గ్రామాల ప్రజలు కనిపించాడంలేదా​? టీఆర్‌ఎస్‌ పార్టీ దొంగల బండిగా మారింది. చివరికి చెప్పులు కూడా విడిచిపెట్టడం లేదు’ అని రేవంత్‌రెడ్డి ఆరోపించారు. 13గ్రామాల ప్రజలు మౌనంగా ఉంటే హక్కులు తీరవన్నారు. వచ్చే బడ్జెట్‌ సమావేశ సమయంలో హైదరాబాద్‌లో 48 గంటల దీక్ష చెపట్టమని నిర్వాసితులకు సూచించారు. దీక్షలో తాను కూడా పాల్గొంటానని, అప్పుడు ప్రభుత్వం ఎందుకు దిగిరాదో చూద్దామని రేవంత్‌ వ్యాఖ్యానించారు. మంచిగా నష్ట పరిహారం చెల్లిస్తే సరి లేదంటే దంచి తీసుకుంటామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.

ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలి : పొన్నం
మిడ్‌మానేరు నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్ని నెరవేర్చాలని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ డిమాండ్‌ చేశారు. నిర్వాసితులకు డబుల్‌ బెడ్‌రూమ్‌, ఇళ్ల నిర్మాణానికి రూ.5లక్షల 4వేలు ఇస్తామని మోసం చేశారని ఆరోపించారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో ఏ ఒక్కరికి న్యాయం జరగడం లేదన్నారు. నిర్వాసితులకు ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చాలని లేనట్లయితే కేసీఆర్‌ వస్తున్న రోజు నల్ల బెలూన్లు ఎగురవేసి నిరసన తెలుపుతామన్నారు. ఎంపీ సంతోష్‌కు పుట్టిన గడ్డపై మమకారం ఉంటే మిడ్‌మానేరు ముంపుకు గురైన 13 గ్రామాలను దత్తత తీసుకోవాలని సవాల్‌ విసిరారు.

Advertisement
 
Advertisement
Advertisement