‘మీసం, తోక వెంట్రుకలకు ఉన్నంత తేడా’

Remarks by Union Minister Narendra Singh Tomar upsets Congress - Sakshi

శివ్‌పురి: ప్రధాన మంత్రి నరేంద్ర మోదీకి, కాంగ్రెస్‌ నేతలకు మధ్య...మీసాల్లో ఉండే వెంట్రుకలకు, తోకలో ఉండే వెంట్రుకలకు ఉన్నంత తేడా ఉందంటూ కేంద్ర గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్, గనుల శాఖల మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ వివాదాస్పదంగా వ్యాఖ్యానించారు. మూడు రోజుల క్రితం మధ్యప్రదేశ్‌లో ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు ఆలస్యంగా వెలుగులోకి వచ్చాయి. గుజరాత్‌ శాసనసభ ఎన్నికల్లో హార్దిక్‌ పటేల్, జిగ్నేశ్‌ మేవానీ, అల్పేశ్‌ ఠాకూర్‌ల మద్దతుతో కాంగ్రెస్‌ బీజేపీపై పోరాడటాన్ని ప్రస్తావిస్తూ తోమర్‌ ఈ మాటలన్నారు. ఈ విషయంపై పీటీఐ సోమవారం మంత్రిని వివరణ కోరగా ‘నేను ఏ కాంగ్రెస్‌ నేత పేరునూ ప్రస్తావించలేదు. కాంగ్రెస్‌ నేతలు, మోదీ వ్యక్తిత్వాల మధ్య తేడాను మాత్రమే ప్రస్తావించాను’ అని చెప్పారు.  

Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top