మోదీ కేబినెట్‌లో బెస్ట్‌ ఎవరు? | Rajnath Singh Best Minister In Modi Cabinet | Sakshi
Sakshi News home page

Jan 26 2019 4:12 PM | Updated on Jan 26 2019 4:39 PM

Rajnath Singh Best Minister In Modi Cabinet - Sakshi

కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ నిలిచారు.

న్యూఢిల్లీ: కేంద్రంలోని నరేంద్ర మోదీ మంత్రివర్గంలో ఉత్తమ పనితీరు కనబరిచిన మంత్రిగా రాజ్‌నాథ్‌ సింగ్‌ నిలిచారు. ఇండియా టుడే– కార్వీ సంస్థలు సంయుక్తంగా మూడ్‌ ఆఫ్‌ ది నేషన్‌ (ఎంవోటీఎన్‌) పేరుతో నిర్వహించిన సర్వేలో మోదీ కేబినెట్‌గా ఉత్తమ మంత్రి (బెస్ట్‌ మినిస్టర్‌)గా ఆయన ఎంపికయ్యారు. సర్వేలో భాగంగా దేశవ్యాప్తంగా 13 వేల మంది అభిప్రాయాలు తీసుకున్నారు. పనితీరు ఆధారంగా మంత్రులకు 1 నుంచి 5 వరకు ర్యాంకులు ఇవ్వాలని కోరారు. (మోదీపై తగ్గుతున్న నమ్మకం)

హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ మంచి పనితీరు కనబరిచారని 50 మంది పేర్కొన్నారు. విదేశాంగ మంత్రి సుష్మా స్వరాజ్‌కు 2వ స్థానం దక్కింది. ఆమెకు 46 శాతం మంది మద్దతు తెలిపారు. ఆర్థిక మంత్రి అరుణ్‌ జైట్లీ మూడో ర్యాంకులో నిలిచారు. 45 శాతం మంది ఆయనవైపు మొగ్గు చూపారు. నాలుగో స్థానంలో నిలిచిన నితిన్‌ గడ్కరీకి 39 శాతం మంది, ఐదో ర్యాంకు దక్కించున్న నిర్మలా సీతారామన్‌కు 26 శాతం మంది అనుకూలంగా స్పందించారు. (ఎన్డీయేకు మైనస్‌.. యూపీయేకు ప్లస్‌)

Advertisement
 
Advertisement
Advertisement