సంపన్న ఎమ్మెల్సీగా మాజీ సీఎం | Rabri Devi Is Richest MLC In Bihar | Sakshi
Sakshi News home page

సంపన్న ఎమ్మెల్సీగా మాజీ సీఎం

Apr 30 2018 5:34 PM | Updated on Apr 30 2018 6:31 PM

Rabri Devi Is Richest MLC In Bihar - Sakshi

ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి (ఫైల్ ఫొటో)

పట్నా: ఇటీవల బిహార్‌ శాసన మండలి సభ్యులుగా ఎన్నికైన 11 మంది నేతల్లో తొమ్మిది మంది కోటీశ్వరులు కాగా, సీఎం నితీష్‌ కుమార్‌ సహా 45 శాతం మంది నేతలపై క్రిమినల్ కేసులున్నాయి. అసోసియేషన్ ఆఫ్ డెమొక్రటిక్ రిఫార్మ్స్‌ (ఏడీఆర్) ఇటీవల విడుదల చేసిన తాజా నివేదికలో పలు ఆసక్తికర అంశాలు వెలుగుచూశాయి.

అత్యంత ధనిక ఎమ్మెల్సీగా 17.92 కోట్ల రూపాయాల ఆస్తులతో మాజీ సీఎం, ఆర్జేడీ నాయకురాలు రబ్రీదేవి నిలిచారు. జేడీయూ నేత రామేశ్వర్ మహతో 15.21 కోట్ల రూపాయల వ్యక్తిగత ఆస్తులతో రెండో స్థానంలో నిలిచారు. ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా స్వయంగా నేతలు సమర్పించిన అఫిడవిట్ల సమాచారంతో ఏడీఆర్ ఈ రిపోర్టు తయారు చేసింది. ఆర్జేడీ ఎమ్మెల్సీల సగటు ఆస్తుల విలువ 10.07 కోట్లుండగా, జేడీయూ ఎమ్మెల్సీల ఆస్తులు 7.34 కోట్ల రూపాయలు, ముగ్గురు బీజేపీ ఎమ్మెల్సీల సగటు ఆస్తులు రూ.1.95 కోట్లు ఉన్నాయి. 

ఎమ్మెల్సీల్లో సీఎం నితీష్, ఆర్జేడీ నేతలు రామచంద్ర పర్బీ, రబ్రీదేవి, హెఏఎం-ఎస్‌కు చెందిన నేత సంతోష్ కుమార్ సుమన్‌లు తమపై క్రిమినల్ కేసులు ఉన్నట్లు అఫిడవిట్లలో పేర్కొన్నారు. 9 మంది ఎమ్మెల్సీలు విద్యార్హత డిగ్రీ పాసైనట్లు తెలిపారని, ఇద్దరు ఇంటర్‌లోపు విద్యార్హత కలిగి ఉన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement