‘దమ్మున్న మగాడు వైఎస్‌ జగన్‌’ | R. Krishnaiah Praises YS Jagan in Singarayakonda | Sakshi
Sakshi News home page

‘దమ్మున్న మగాడు వైఎస్‌ జగన్‌’

Apr 1 2019 3:29 PM | Updated on Apr 1 2019 3:54 PM

R. Krishnaiah Praises YS Jagan in Singarayakonda - Sakshi

వైఎస్సార్‌సీపీ అభ్యర్థులతో కలిసి ఎన్నికల ప్రచారం చేస్తున్న ఆర్‌. కృష్ణయ్య

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందని ఆర్‌. కృష్ణయ్య అన్నారు.

సాక్షి, హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌కు పట్టిన దరిద్రం పోవాలంటే వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ నాయకుడు ఆర్‌. కృష్ణయ్య పిలుపునిచ్చారు. ఎన్నికల ప్రచారంలోభాగంగా సోమవారం ప్రకాశం జిల్లా సింగరాయకొండలో నిర్వహించిన రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ... బీసీలను చంద్రబాబు ఓటు బ్యాంకులా చూస్తున్నారని మండిపడ్డారు.

వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే బీసీల ఆత్మగౌరవం పెరుగుతుందన్న విశ్వాసాన్ని వ్యక్తం చేశారు. బీసీలను చదువుకునేలా చేసింది వైఎస్‌ రాజశేఖరరెడ్డి అయితే.. అదే బీసీలను  తలెత్తుకోనేలా చేసేది వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి అని పేర్కొన్నారు. జగన్ దమ్మున్న మగాడు మాట ఇస్తే తప్పడు అని ప్రశంసించారు. ‘ఆంధ్రకి దరిద్రం చంద్రబాబు. ఈ దరిద్రం పారిపోవాలి అంటే సీలింగ్‌ ఫ్యాన్ గుర్తుకి ఓటు వేయాలి. బీసీల మద్దతు వైఎస్సార్‌సీపీకే. చంద్రబాబుని చిత్తు చిత్తుగా ఓడించాల’ని కృష్ణయ్య పిలుపునిచ్చారు.

చేపలు కూడా తిట్టుకుంటాయి
చంద్రబాబు కరువును తోడు తెచ్చుకొంటారని, ఆయన వస్తే వానలు రావని ఎద్దేవా చేశారు. చెరువులో చేపలు కూడా చంద్రబాబును తిట్టుకుంటాయని వ్యంగ్యంగా అన్నారు. ‘బీసీలను అణగతొక్కడమే చంద్రబాబు పని. బీసీల సమావేశానికి కూడా ఎమ్మెల్యేలను వెళ్ళొద్దని చంద్రబాబు హుకుం జారీ చేశారు. బీసీ జడ్జిలను హైకోర్టు న్యాయమూర్తిలు కాకుండా అడ్డుకున్నారు. నన్ను బలవంతంగా రాజకీయాల్లోకి లాక్కొచ్చి మోసంచేసారు. చంద్రబాబు పచ్చి బీసీల వ్యతిరేకి’ అని త్రీవస్థాయిలో కృష్ణయ్య మండిపడ్డారు.

Advertisement
 
Advertisement
Advertisement