
సాక్షి, ఉయ్యూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి 148వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. ఆదివారం ఉదయం ఆయన ఉయ్యూరు శివారు నుంచి పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి మంటాడ, తాడంకి, కనుమూరు, కురుమద్దాలి, ఉరుటూరు క్రాస్ రోడ్డు మీదుగా పామర్రు వరకు జననేత పాదయాత్ర కొనసాగనుంది. పామర్రులో బహిరంగసభలో వైఎస్ జగన్ ప్రసంగిస్తారు. కాగా, వైఎస్ జగన్ చేపట్టిన పాదయాత్రకు కృష్ణా జిల్లాలో భారీగా స్పందన వస్తోంది. జననేతను కలుసుకునేందుకు ప్రజలు ఎండను సైతం లెక్కచేయకుండా వస్తున్నారు.