మొదటి విడత ప్రచారం సమాప్తం

Poll Campaigning Ends For First Phase Of Lok Sabha Elections - Sakshi

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఈనెల 11వ తేదీన మొదటి దశలో జరగనున్న 91 లోక్‌సభ స్థానాలకు ఎన్నికల ప్రచారం మంగళవారం సాయంత్రంతో ముగిసింది. పార్లమెంట్‌లోని 543 లోక్‌సభ స్థానాలకు గాను ఏడు విడతలుగా ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే.

మొదటి విడతలో 18 రాష్ట్రాలు, 2 కేంద్ర పాలిత ప్రాంతాలు..ఆంధ్రప్రదేశ్‌ (25), తెలంగాణ (17), యూపీ(8), ఉత్తరాఖండ్‌ (5), ఒడిశా (4), మహారాష్ట్ర (7), బిహార్‌ (4), అస్సాం (5), పశ్చిమబెంగాల్‌ (2), జమ్మూకశ్మీర్‌ (2), మేఘాలయ (2), అరుణాచల్‌ ప్రదేశ్‌ (2), మిజోరం, త్రిపుర, మణిపూర్, ఛత్తీస్‌గఢ్, నాగాలాండ్, సిక్కిం, అండమాన్‌ నికోబార్‌ దీవులు, లక్షద్వీప్‌లలో ఒక్కో స్థానానికి 11న ఎన్నికలు జరగనున్నాయి. వీటితోపాటు ఆంధ్రప్రదేశ్‌ (175), సిక్కిం (32), ఒడిశాలోని 147 స్థానాలకు గాను 28 సీట్లకు కూడా ఎన్నికలు జరగనున్నాయి. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top