నామినేషన్లు వేసేందుకు పార్టీలు సై 

Political Parties Intrested In Huzurnagar Bypoll Election - Sakshi

ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించిన టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ 

నేడో, రేపో బీజేపీ అభ్యర్థి ఫైనల్‌       

సాక్షి, సూర్యాపేట: హుజూర్‌నగర్‌ అ సెంబ్లీ ఉప ఎన్నికపై అన్ని పార్టీలు గురి పెట్టా యి. ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, కాంగ్రెస్, బీజేపీతో పాటు వామపక్షాలు, జేఏసీలు, ఇతర పార్టీలు తామేంటో నిరూపించుకునేందుకు పోటీకి సన్నద్ధమవుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ తమ అభ్యర్థులను ఇప్పటికే ప్రకటించాయి. నామినేషన్లకు ఈనెల 30వ తేదీ చివరి రోజు కావడంతో మిగతా పార్టీలు రెండు, మూడు రోజుల్లో అభ్యర్థులను ఖరారు చేసి నామినేషన్లు వేయించేందుకు కసరత్తు చేస్తున్నాయి.  

ఈ ఎన్నికలో ఏ పార్టీ తర ఫున ఎవరు బరిలో ఉంటారు..?, అస లు ఎంత మంది చివరికి ఉప యు ద్ధంలో ఉంటారని జోరుగా చర్చసాగుతోంది. టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా శానం పూడి సైదిరెడ్డిని, కాంగ్రెస్‌ అభ్యర్థిగా పద్మావతిరెడ్డిని ప్రకటించడంతో.. ప్రధాన పార్టీల బరి తేలింది. ఇక బీజేపీ నేడో.. రేపో తమ అభ్యర్థిని ప్రకటించే అవకాశం ఉంది. శ్రీకళారెడ్డి, జిల్లేపల్లి వెంకటేశ్వరరావు, బొబ్బా భాగ్యారెడ్డి, ఎన్‌ఆర్‌ఐ కోటా అప్పిరెడ్డి, డాక్టర్‌ రామారావులు ఈ పార్టీ నుంచి టికెట్‌ రేసులో ఉన్నారు.

సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం సూర్యాపేటలో విలేకరుల సమావేశంలో సీపీఎం, సీపీఐ, టీడీపీ, టీజేఎస్‌ ఉమ్మడి అభ్యర్థిని బరిలోకి దింపుతుందన్నారు. ఇప్పటికే ఈ విషయమై ఆయా పార్టీలతో చర్చించినట్లు చెప్పారు. అయితే గత పార్లమెంట్‌ ఎన్నికల్లో సీపీఎం నుంచి నల్లగొండ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మల్లు లక్ష్మి లేదా మిర్యాలగూడ మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డిని ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిపుంతారన్న ప్రచారం ఆయా పార్టీల్లో జరుగుతోంది.

హుజూర్‌నగర్‌ బరిలో ఇదే నియోజకవర్గానికి చెందిన కొప్పుల ప్రతాప్‌రెడ్డి ఉంటారని ఓయూ జేఏసీ, తామూ పోటీలో ఉంటామని బీఎస్పీ, ఎమ్మార్పీఎస్‌(టీఎస్‌), రిపబ్లిక్‌ పార్టీ ఆఫ్‌ ఇండియా – ఏ(ఆర్పీఐ)లు ప్రకటించాయి. వీరేకాక స్థానికంగా ఉన్న కొంతమంది న్యాయవాదులు పోటీ చేయడానికి నామినేషన్‌ పత్రాలు తీసుకెళ్లారు. నామినేషన్ల సమర్పణ తుది గడువు సమీపిస్తున్నా కొద్దీ.. బరిలోకి దిగేవారి సంఖ్య పెరగనుందని రాజకీయ నేతలు పేర్కొంటున్నారు. 

చివరికి మిగిలేదెవరు? 
నామినేషన్లు ఎంత మంది వేసినా వచ్చే నెల 3న ఉపసంహరణలతో బరిలో ఉండే అభ్యర్థుల సంఖ్య తేలనుంది. పార్టీల పరంగా వేసిన అభ్యర్థులంతా పోటీలో ఉంటారు. ఇండిపెండెంట్లు, జేఏసీల పేరుతో వేసే నామినేషన్లు ఉప సంవహరించుకోకపోతే గత ఎన్నికలతో పోలిస్తే ఎక్కువ మంది బరిలో ఉండే అవకాశాలున్నాయి. ఈ నెల 23న నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుంచి మూడు రోజుల్లో 60 నామినేషన్‌ పత్రాలను తీసుకెళ్లారు.

అయితే బరిలో ఉండి చివరి వరకు ఉప పోరులో క్రియాశీలకంగా ఉండేదెవరోనని, పార్టీతో పాటు అభ్యర్థుల ఆధారంగా స్పష్టత రానుంది. ప్రధాన పోటీ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ మధ్యే ఉండనుండగా బీజేపీ కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. బలమైన అభ్యర్థిని బరిలోకి దింపి చివరి వరకు పోరాడాలని నిర్ణయించింది. రాష్ట్ర స్థాయి నేతలతో పాటు ఆ పార్టీ నలుగురు ఎంపీలను ప్రచారానికి దింపనుంది. అభ్యర్థిని ఖరారు చేసిన తర్వాత కార్యక్షేత్రంలోకి దూకాలని ఆపార్టీ యోచిస్తోంది.  

గత ఎన్నికల్లో 17మంది పోటీ 
2018 డిసెంబర్‌లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి చివరకు 17 మంది పోటీలో ఉన్నారు. అందరికి కలిపి 1,92,844 ఓట్లు పడ్డాయి. ఇందులో ప్రధాన పార్టీల అభ్యర్థులైన ఉత్తమ్‌కుమార్‌రెడ్డికి 92,996 ఓట్లు, శానంపూడి సైదిరెడ్డికి 85,530 ఓట్లు, బొబ్బ భాగ్యారెడ్డికి 1,555, పారేపల్లి శేఖర్‌రావుకు 2,121 ఓట్లు వచ్చాయి. మిగతా ఓట్లు ఇతర పార్టీల అభ్యర్థులు, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన అభ్యర్థులకు దక్కాయి.

స్వతంత్ర అభ్యర్థిగా బరిలోకి దిగిన మేకల రఘుమారెడ్డికి..  సీపీఎం, బీజేపీ అభ్యర్థుల కన్నా ఎక్కువ ఓట్లు పోల్‌ అయ్యాయి. ఎక్కువ ఓట్లు వచ్చిన అభ్యర్థుల్లో వరుస క్రమంలో చూస్తే కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల తర్వాత ఆయనే ఉన్నారు. ఆయనకు గత ఎన్నికల్లో 4,944 ఓట్లు వచ్చాయి. ఈ సారి ఓట్లు రాలాలంటే పార్టీలతో పాటు అభ్యర్థుల చరిష్మా కూడా ముఖ్యమైన అంశమేనని రాజకీయ నేతలు చర్చించుకుంటున్నారు. అన్ని పార్టీలు ఈ ఎన్నికల్లో బరిలోకి దిగి తమ బలమేంటో తేల్చుకునేందుకు సై అంటున్నా, ప్రధాన పార్టీల మధ్యనే గెలుపు ఓటములుండనున్నాయి.   

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top