‘చౌకీదార్ల’ను మోదీ పట్టించుకోలేదు | PM Modi does not care about chowkidars | Sakshi
Sakshi News home page

‘చౌకీదార్ల’ను మోదీ పట్టించుకోలేదు

Mar 23 2019 4:48 AM | Updated on Mar 23 2019 4:48 AM

PM Modi does not care about chowkidars - Sakshi

న్యూఢిల్లీ: చౌకీదార్ల పేరు వాడుకుంటున్న ప్రధాని మోదీ వారి సంక్షేమాన్ని ఎన్నడూ పట్టించుకోలేదని కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ ఆరోపించారు. తక్కువ వేతనాలతో ఇబ్బంది పడుతున్న చౌకీదార్లు(వాచ్‌మెన్‌) సుమారు పదివేల మంది ఆందోళనకు దిగారంటూ మీడియాలో వచ్చిన కథనాన్ని ప్రస్తావిస్తూ శుక్రవారం ఆయన ఫేస్‌బుక్‌లో ఒక పోస్ట్‌ చేశారు. ‘మీరు ఎవరి వెనుక దాక్కుంటున్నారో కనీసం వారి గురించైనా ఆలోచించండి’ అని అన్నారు. రఫేల్‌ ఒప్పందంలో మోదీ అవినీతికి పాల్పడ్డారంటూ ‘చౌకీదార్‌ చోర్‌ హై’(కాపలాదారే దొంగ) అంటూ రాహుల్‌ ఎద్దేవా చేస్తుండగా, ‘నేనూ చౌకీదార్‌నే’ అంటూ ప్రధాని మోదీ ప్రచారోద్యమం ప్రారంభించిన విషయం తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement