టీడీపీ నేతల అక్రమ మద్యం రవాణా

Penamaluru MLA Parthasarathy Slams On Chandrababu And TDP In Krishna - Sakshi

సాక్షి, కృష్ణా: ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు రుణమాఫీ పేరుతో రైతుల్ని, మహిళల్ని మోసం చేశారని పెనమలూరు ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. ఏడాది కాలంలో ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పధకాలు ప్రవేశపెట్టిందని గుర్తుచేశారు. పార్టీతో సంబంధం లేకుండా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు. ప్రస్తుత పరిస్ధితుల్లో ఇళ్ల స్ధలం పేదవారి కల అన్నారు. ఆ కలను ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ ప్రభుత్వం నిజం చేస్తోందని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలో దాదాపు ఇరవై వేల మందికి ఇళ్ల స్థలాలు ఇస్తున్నామని తెలిపారు. ఇళ్ల స్థలం ఇవ్వటమే కాదు ప్రభుత్వం దశల వారిగా ఇళ్లను కట్టిస్తోందన్నారు. రైతుల కోసం అనేక పధకాలు అమలు చేస్తున్నామని, చెప్పిన దానికంటే ఎక్కువగానే  చేస్తున్నామని పార్థసారథి  అన్నారు. (‘లోకేశ్‌ ఆవేదన తాలూకు ఉద్రేకం’)

ప్రభుత్వం చేసే సంక్షేమ పధకాల్ని టీడీపీ నాయకులు జీర్ణించుకోలేకపోతున్నారని ఎమ్మెల్యే పార్థసారథి మండిపడ్డారు. అందుకే ఒక పధకం ప్రకారం ప్రభుత్వంపై బురద చల్లే కార్యక్రమం చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వం ఒకవైపు దశల వారి మద్యపాన నిషేదం చేస్తుంటే టీడీపీ నేతలు మద్యం అక్రమ రవాణా చేస్తున్నారని ధ్వజమెత్తారు. పెనమలూరు నియోజకవర్గంలో టీడీపీ నాయకులు రఫీ, సురేష్, ఆనంద్ బాబు, అరుణాచల్‌ ప్రదేశ్ రాష్ట్రం నుంచి అక్రమంగా మద్యం తెప్పించి జిల్లా వ్యాప్తంగా సరఫరా చేస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నాయుడికి మద్యపాన నిషేదం చేయ్యటం ఇష్టం లేదన్నారు. టీడీపీ నేతలు తమ చేతిలో ఉన్న విజయపాల డైరీ వ్యానుల ద్వారా మద్యం అక్రమ రవాణ చేస్తున్నారని పార్థసారథి ఆరోపించారు. (‘ఆ వాహనాలు ఎక్కడున్నా.. సీజ్‌ చేయాలి’)

అదేవిధంగా పామర్రు ఎమ్మెల్యే  కైలే అనిల్ కుమార్ మాట్లాడుతూ..  ఏడాది కాలంలోనే ఇచ్చిన హమీలను తొంభై ఐదు శాతం పూర్తి చేశామని తెలిపారు. గత ఎన్నికల్లో  టీడీపీ పార్టీకి ప్రజలు బుద్ది చెప్పారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వం పేదలకు ముప్పై లక్షల ఇళ్ల పట్టాలు పంపిణీ చేస్తే చంద్రబాబుతోపాటు టీడీపీ పార్టీ కూడా కనుమరుగు అవ్వటం ఖాయమన్నారు. ప్రభుత్వ పధకాలు చూసి ఓర్వలేక టీడీపీ పార్టీ ప్రభుత్వంపై బురద చల్లుతోందని కైలే అనిల్ కుమార్ మండిపడ్డారు. 

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top