‘లోకేశ్‌ ఆవేదన తాలూకు ఉద్రేకం’ | Vijaya sai reddy fires on Chandrababu | Sakshi
Sakshi News home page

‘లోకేశ్‌ ఆవేదన తాలూకు ఉద్రేకం’

Jun 9 2020 1:29 PM | Updated on Jun 9 2020 2:04 PM

Vijaya sai reddy fires on Chandrababu - Sakshi

సాక్షి, అమరావతి : లోకేశ్ బాబు ఆవేశం చూస్తుంటే ఏదో ఉపద్రవం ముంచుకొచ్చినట్టే కనిపిస్తోందని వైఎస్సార్‌సీపీ రాజ్యసభ సభ్యులు విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. టీడీపీ పార్టీ అధ్యక్షుడిగా తనను కాదని తండ్రి చంద్రబాబు నాయుడు మరొకరిని ఎంపిక చేయడం వల్ల తన్నుకొచ్చిన ‘ఆవేదన తాలూకు ఉద్రేకం’ బయటపడినట్టు అనిపిస్తోందని ట్విటర్‌లో పేర్కొన్నారు. పనికిరాడని సొంత తండ్రే సర్టిఫై చేస్తే తన ఫ్యూచర్ ఏమిటని కుంగిపోతున్నాడు పాపం అని ఎద్దేవా చేశారు.(టీడీపీ హయాంలో అభివృద్ధి శూన్యం)

హైదరాబాద్‌లో ఉన్న చంద్రబాబు మనసంతా ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతోందని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షాల కాళ్లు పట్టుకోవడం ఎలా అనే దానిపై వర్కవుట్ చేస్తున్నాడని తెలిపారు. బీజేపీకి దగ్గర కావాలని తన మనుషులతో ఇప్పటికే అనిపించారని తెలిపారు. ఎల్లో మీడియా ఎంటరై అదొక చారిత్రక అవసరమన్నట్టు వరుస కథనాలు వడ్డిస్తుందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు.(కొత్త ఒరవడికి ఏపీ ప్రభుత్వం శ్రీకారం)

‘రౌడీ షీటర్లకు ఎమ్మెల్యే టికెట్లిచ్చాడు. ఎక్కడ గ్యాంగ్ వార్ జరిగినా రక్తపాతం సృష్టించేది బాబు గారి అనుంగు శిష్యులే. వైఎస్‌ జగన్‌పైనే హత్యాయత్నం చేయించిన చరిత్ర. 60 ఏళ్ల వృద్ధురాలిపై కేసేమిటని వెనకేసుకొచ్చాడు. రికార్డులు తీస్తే ఆయన హయాంలోనే ఆమె పైన 13 ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయని తేలింది’ అని మరో ట్వీట్‌లో విజయసాయిరెడ్డి పేర్కొన్నారు.(విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖుల బృందం)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement