విజయవాడ చేరుకున్న చిరు, నాగార్జున | Tollywood Celebrities Group Reach Gannavaram Airport | Sakshi
Sakshi News home page

విజయవాడ చేరుకున్న సినీ ప్రముఖుల బృందం

Jun 9 2020 12:37 PM | Updated on Jun 9 2020 3:17 PM

Tollywood Celebrities Group Reach Gannavaram Airport - Sakshi

సాక్షి, కృష్ణా: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ నేపథ్యంలో సినీ ప్రముఖుల బృందం మంగళవారం మధ్యాహ్నం గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. చిరంజీవి, నాగార్జున, సి.కల్యాణ్, త్రివిక్రమ్, రాజమౌళి, డి.సురేష్ బాబు, దిల్‌రాజు, వెంకట్రామి రెడ్డి, దామోదర్‌ ప్రసాద్‌ హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడి నుంచి గోకరాజు గంగరాజు గెస్ట్ హౌస్‌కు వెళ్లారు. భోజనం చేసి కొంత సేపు విశ్రాంతి అనంతరం మధ్యాహ్నం 3 గంటలకు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సినీ ప్రముఖుల బృందం ముఖ్యమంత్రిని కలవనుంది.

కరోనా లాక్‌డౌన్‌ కారణంగా నిలిచిపోయిన సినిమా షూటింగ్‌లకు అనుమతితో పాటు థియేటర్ల ఓపెన్‌, తదితర అంశాల గురించి కూడా సీఎం వైఎస్‌ జగన్‌తో వారు చర్చించే అవకాశం ఉంది. ఇక తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో సినిమా, టీవీ షూటింగులకు అనుమతినిచ్చిన సంగతి తెలిసిందే.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement