శివసేనకు కార్యకర్త రాజీనామా | A Party Mumbai Activist Who Resigned to the Shiv Sena | Sakshi
Sakshi News home page

‘మహా’ ఎఫెక్ట్‌; శివసేనకు కార్యకర్త రాజీనామా

Nov 27 2019 2:30 PM | Updated on Nov 27 2019 3:05 PM

A Party Mumbai Activist Who Resigned to the Shiv Sena - Sakshi

సాక్షి, ముంబై : మహారాష్ట్రలో నాటకీయ పరిణామాల మధ్య మహాకూటమి నేతృత్వంలో ప్రభుత్వం ఏర్పాటవుతున్న సందర్భంలో శివసేనలో లుకలుకలు మొదలవుతున్నాయి. విరుద్ధ సిద్ధాంతాలు కలిగిన ఇరు పార్టీలు ఒకే గూటికి చేరడం పట్ల ఇన్నాళ్లూ కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా పనిచేసిన వాళ్లు శివసేనకు దూరమవుతున్నారు. ముంబైకి చెందిన రమేష్‌ సోలంకి అనే శివసేన కార్యకర్త ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు బుధవారం ట్విటర్‌ ద్వారా ప్రకటించారు. సిద్ధాంతాలకనుగుణంగా పనిచేస్తున్న నాకు కాంగ్రెస్‌తో శివసేన పొత్తు పెట్టుకోవడం నచ్చలేదని, ఇక ఆ పార్టీలో ఉండలేనని వెల్లడించారు. ఇన్నాళ్లూ తనకు పార్టీలో పనిచేసే అవకాశం కల్పించిన ఉద్దవ్‌ థాకరేకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక శివసేన తీరుపట్ల పలువురు హిందుత్వవాదులు మండిపడుతున్నారు. ముఖ్యమంత్రి పదవి కోసం సిద్ధాంతాలను వదిలేస్తారా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement