టీఆర్‌ఎస్‌ ఫ్లోర్‌ లీడర్‌ ఎవరు?

Party leaders say that the TRSLP leader will be given the opportunity - Sakshi

రెండోసారి ఎంపీ అయిన వారు నలుగురే

కొత్త, పసునూరి, పాటిల్, నామా పేర్ల పరిశీలన

సాక్షి, హైదరాబాద్‌: టీఆర్‌ఎస్‌ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. గత లోక్‌సభలో టీఆర్‌ఎస్‌ లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఎ.పి.జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. టీఆర్‌ఎస్‌ కీలకనేతగా గుర్తింపు ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్‌ సీనియర్‌ ఎంపీగానూ ఉండేవారు.

ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజామాబాద్‌ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత సైతం పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్‌ఎస్‌ తరుపున గెలిచిన 9 మంది ఎంపీలలో ఉన్న బి.బి.పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, దయాకర్, నామా నాగేశ్వర్‌రావులో ఒకరికి టీఆర్‌ఎస్‌ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యలు చెబుతున్నారు. వారంలోపే కొత్త ఎంపీలతో సమావేశం నిర్వహించి లోక్‌సభ పక్షనేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు.

Read latest Politics News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top