breaking news
pasunoori dayakar
-
టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ ఎవరు?
సాక్షి, హైదరాబాద్: టీఆర్ఎస్ లోక్‌సభాపక్ష నాయకుడిగా ఎవరు ఉంటారనేది ఆ పార్టీలో ఆసక్తికరంగా మారింది. కీలకమైన నేతలు ఎన్నికల్లో పరాజయం పాలు కావడంతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఈ బాధ్యతలను ఎవరికి అప్పగిస్తారనే చర్చ మొదలైంది. గత లోక్‌సభలో టీఆర్ఎస్ లోక్‌సభ పక్షనేతగా ఉన్న ఎ.పి.జితేందర్‌రెడ్డికి ఈసారి ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇవ్వలేదు. టీఆర్ఎస్ కీలకనేతగా గుర్తింపు ఉన్న బోయినపల్లి వినోద్‌కుమార్ సీనియర్ ఎంపీగానూ ఉండేవారు. ఆయన ఈ ఎన్నికల్లో ఓడిపోయారు. నిజామాబాద్ ఎంపీగా ప్రాతినిథ్యం వహించిన కల్వకుంట్ల కవిత సైతం పరాజయం పాలయ్యారు. ప్రస్తుతం టీఆర్ఎస్ తరుపున గెలిచిన 9 మంది ఎంపీలలో ఉన్న బి.బి.పాటిల్, ప్రభాకర్‌రెడ్డి, దయాకర్, నామా నాగేశ్వర్‌రావులో ఒకరికి టీఆర్ఎస్ఎల్పీ నేతగా అవకాశం ఇవ్వనున్నట్లు పార్టీ ముఖ్యలు చెబుతున్నారు. వారంలోపే కొత్త ఎంపీలతో సమావేశం నిర్వహించి లోక్‌సభ పక్షనేత ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయనున్నారు. -
10 సీట్లు ఖరారు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రకటనను టీఆర్ఎస్ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్ అభ్యర్థులు ఎవరనే అంచనాతో జాబితా రూపొందిస్తోంది. రాష్ట్రంలో 16 లోక్‌సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. ‘ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి. నామినేషన్ దాఖలకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోండి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’అని టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాల్లోని ఆశావహులకు సమాచారం ఇచ్చింది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో నాలుగు టీఆర్ఎస్ సిట్టింగ్ సెగ్మెంట్లు ఉండటంతో ఆ ఎంపీల్లో ఆందోళన పెరుగుతోంది. ఆయా సిట్టింగ్ ఎంపీలు, ఆశావహులు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ‘అన్నా ఆ సెగ్మెంట్‌పై అధిష్టానం స్పష్టత ఇచ్చిందట. మీకు సమాచారం వచ్చిందా? ఫోన్ వస్తే నాకు కచ్చితంగా చెప్పండి’అని చెప్పుకుంటున్నారు. పెండింగ్ సీట్లపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. కరీంనగర్ ఎన్నికల ప్రచార సభ తర్వాత లేదా మంగళవారం నిజామాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ తర్వాతే అభ్యర్థులపై స్పష్టత వస్తుందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. కాంగ్రెస్ ఇప్పటికే 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారంలోగా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే టీఆర్ఎస్ అభ్యర్థుల ప్రకటన ముందుగానే జరగవచ్చని తెలుస్తోంది. ఆరు లోక్‌సభ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారుపై టీఆర్ఎస్ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్ స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఈ సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను ఖరారు చేసి అన్ని సీట్లకూ ఒకేసారి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్ఎస్ ముఖ్య నేతలు చెబుతున్నారు. ►నల్లగొండ సిట్టింగ్ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలోనే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్ఎస్ అధిష్టానం ఈ స్థానంలో తేరా చిన్నపరెడ్డి, వి. నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. ►మహబూబ్‌నగర్ లోక్‌సభ సెగ్మెంట్లో సిట్టింగ్ ఎంపీ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపై ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మాజీమంత్రి సి.లక్ష్మా రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. ►ఖమ్మం సిట్టింగ్ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు పొంగులేటి ప్రయత్నించారని టీఆర్ఎస్ అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఈ సెగ్మెంట్లో ఖమ్మంలోని మరో కీలక సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని టీఆర్ఎస్ భావిస్తోంది. దీంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్ పేర్లను పరిశీలిస్తోంది. ►మహబూబాబాద్ సెగ్మెంట్ అభ్యర్థిపై టీఆర్ఎస్ అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్ చివరి నిమిషంలో టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్ పేర్లను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. ►పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం ఉంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి. వివేకానంద టికెట్ ఆశిస్తున్నారు. అయితే వివేకానంద అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అన్నింటినీ పరిశీలించి నిర్ణయానికి రావా లని టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ భావిస్తున్నా రు. చివరి నిమిషంలో వివేకానందకు టికెట్ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ►సికింద్రాబాద్ సెగ్మెంట్లో టీఆర్ఎస్ అధినేత సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టికెట్లను ఖరారు చేస్తున్నారు. తలసాని సాయికిరణ్ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, దండె విఠల్ పేర్లను పరిశీలిస్తున్నారు. ►టీఆర్ఎస్ అధిష్టానం పది స్థానాలపై స్పష్టతకు వచ్చింది. ఈ స్థానాల్లో అభ్యర్థులుగా ఉండే వారికి అనధికారికంగా సమాచారం ఇచ్చింది. సమాచారం ఇచ్చిన స్థానాలు ఇవీ ఆదిలాబాద్: గోడం నగేశ్ కరీంనగర్: బోయినపల్లి వినోద్ కుమార్ నిజామాబాద్: కల్వకుంట్ల కవిత జహీరాబాద్: భీంరావు బసంత్‌రావు పాటిల్ మెదక్: కొత్త ప్రభాకర్‌రెడ్డి భువనగిరి: బూర నర్సయ్యగౌడ్ వరంగల్: పసునూరి దయాకర్ చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి మల్కాజిగిరి: కె. నవీన్‌రావు నాగర్ కర్నూల్: పి. రాములు -
మట్టి మనుషుల ప్రేమకథ
సూర్య భరత్‌చంద్ర, శ్రావ్యారావు జంటగా తెరకెక్కుతోన్న చిత్రం ‘సంత’. ‘మట్టి మనుషుల ప్రేమకథ’ అన్నది ఉపశీర్షిక. నెల్లుట్ల ప్రవీణ్‌చందర్ దర్శకత్వంలో శ్రీ సుబ్రమణ్య పిక్చర్స్ పతాకంపై శ్రీ జైవర్దన్ బోయెనేపల్లి నిర్మిస్తోన్న ఈ సినిమా వరంగల్‌లో ప్రారంభమైంది. తొలి సన్నివేశానికి ఎమ్మెల్యే రాజయ్య కెమెరా స్విచ్చాన్ చేయగా, ఎంపీ పసునూరి దయాకర్ క్లాప్ ఇచ్చారు. నిర్మాత శ్రీ జైవర్దన్ మాట్లాడుతూ– ‘‘సంత నేపథ్యంలో సాగే ప్రేమకథ ఇది. ఫీల్ గుడ్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోన్న ఈ చిత్రం గ్రామీణ నేపథ్యంలో ఉంటుంది. యువతరంతో పాటు అన్నివర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది. మా టీమ్ అందరికీ మంచి పేరు తీసుకొస్తుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. కిన్నెర, మధుమణి, ‘తాగుబోతు’ రమేష్, రఘు కారుమంచి, ప్రసన్న, సాదయ్య, దుర్గేష్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: ఫణీంద్ర వర్మ అల్లూరి, కథ–కథనం –సంగీతం– దర్శకత్వం: నెల్లుట్ల ప్రవీణ్ చందర్. -
'టీఆర్ఎస్కు, కేసీఆర్‌కు రుణపడి ఉంటా'
ఇది సామాన్య కార్యకర్తల విజయం వరంగల్ అభివృద్ధికి కృషి చేస్తా: పసునూరి దయాకర్ వరంగల్: తన గెలుపు.. సామాన్య కార్యకర్తల విజయంగా భావిస్తున్నానని వరంగల్ ఎంపీ పసునూరి దయాకర్ అన్నారు. ఓట్ల లెక్కింపు అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. సామాన్య కార్యకర్తగా ఉన్న తనకు పార్లమెంట్ ఎన్నికల్లో టికెట్ ఇచ్చి గెలిపించిన టీఆర్ఎస్ పార్టీకి, పార్టీ అధినేత సీఎం చంద్రశేఖర్‌రావుకు రుణపడి ఉంటానన్నారు. తెలంగాణ ఉద్యమంలో మమేకమై పార్టీ పటిష్టత కోసం పనిచేసిన తనకు పార్టీ అధినేత గుర్తింపు ఇవ్వడమే కాకుండా, ప్రచారం చేసేందుకు పార్టీ నిధులు అందించారని, పేదలకు కేసీఆర్ అండగా ఉన్నడన్న దానికి ఇది నిదర్శనమమని దయాకర్ అన్నారు. జిల్లా చరిత్రలోనే అత్యధిక మెజార్టీతో గెలిపించి దేశంలోనే గుర్తింపు తెచ్చిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని, వరంగల్ అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి చేస్తానని అన్నారు. డిప్యూటీ సీఎం కడియం శ్రీహరితో పాటు ఎమ్మెల్యేలు, పార్టీ ముఖ్య నేతలందరి సహకారంతో జిల్లా సమగ్రాభివృద్ధిలో భాగస్వామ్యం అవుతానని చెప్పారు. తన గెలుపు కోసం శ్రమించిన టీఆర్ఎస్ నేతలు, కార్యకర్తలకు ఆయన కృజ్ఞతలు తెలిపారు. -
కడియం రికార్డు బద్దలయింది
వరంగల్ : వరంగల్ లోక్‌సభ ఉప ఎన్నికలో గత రికార్డు బద్దలయింది. టీఆర్ఎస్ అభ్యర్థి పసునూరి దయాకర్ ప్రస్తుతం 4 లక్షలకు పైగా ఓట్లతో మెజార్టీ దిశగా దూసుకు వెళుతున్నారు. గతంలో ఇక్కడ రికార్డు ప్రస్తుత డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేరిట ఉండేది. దయాకర్ సాధించిన ఈ రికార్డు గతంలో 2014 ఎన్నికల్లో సీఎం కేసీఆర్ సాధించిన మెజార్టీ కన్నా కూడా అధికమే. ప్రస్తుతానికి టీఆర్ఎస్-5,39,096, కాంగ్రెస్-1,53,896, బీజేపీ - 1,28,452, వైఎస్ఆర్ సీపీకి-20,666 ఓట్లు లభించాయి. 2014లో ఎన్నికల్లో వరంగల్ నుంచి పోటీ చేసిన టీఆర్ఎస్ నేత కడియం శ్రీహరి 3,92,137 (30.90 శాతం) ఓట్ల మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్థి రాజయ్యపై విజయం సాధించారు. కాగా, నేటి ఉప ఎన్నికల ఫలితాల్లోని ప్రతి రౌండ్ లో టీఆర్ఎస్ పార్టీకి 62 శాతం ఓట్లు వచ్చినట్టు ప్రాథమిక సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. కారు పార్టీ హవా ఇలాగే కొనసాగితే మెజారిటీ 5 లక్షలు దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. మొత్తం 22 రౌండ్లలో ఓట్ల లెక్కింపు పూర్తికానుంది. -
కడియం రికార్డు బద్ధలయింది