10 సీట్లు ఖరారు

The selection of TRS Loksabha candidates for the final phase - Sakshi

తుది దశకు చేరిన టీఆర్‌ఎస్‌ లోక్‌సభ అభ్యర్థుల ఎంపిక

పోటీకి సిద్ధంగా ఉండాలని 10 మందికి సమాచారం

పెండింగ్‌లో ఆరు లోక్‌సభ సెగ్మెంట్లు.. వాటిలో 4 సిట్టింగ్‌ స్థానాలు

ఒకట్రెండు రోజుల్లో స్పష్టత వచ్చే అవకాశం

ఆశావహుల్లో ఉత్కంఠ

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్ర సమితి లోక్‌సభ అభ్యర్థుల ప్రక్రియ తుది దశకు చేరింది. అభ్యర్థుల ప్రకటనను టీఆర్‌ఎస్‌ వ్యూహాత్మకంగా జాప్యం చేస్తోంది. ఆయా నియోజకవర్గాల్లోని రాజకీయ, సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని కాంగ్రెస్‌ అభ్యర్థులు ఎవరనే అంచనాతో జాబితా రూపొందిస్తోంది. రాష్ట్రంలో 16 లోక్‌సభ సెగ్మెంట్లను గెలుచుకోవాలనే లక్ష్యంతో అన్ని అంశాలను పరిగణనలోకి తీసుకొని ఇప్పటికే పది స్థానాల్లో అభ్యర్థులు ఎవరనే దానిపై స్పష్టత ఇచ్చింది. ‘ఎన్నికల్లో పోటీకి సిద్ధంగా ఉండండి. నామినేషన్‌ దాఖలకు అవసరమైన అన్నింటినీ సిద్ధం చేసుకోండి. త్వరలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఈ విషయం ఎవరికీ చెప్పొద్దు’అని టీఆర్‌ఎస్‌ అధిష్టానం పది స్థానాల్లోని ఆశావహులకు సమాచారం ఇచ్చింది. మరో ఆరు స్థానాల్లో అభ్యర్థుల ఎంపికను పెండింగ్‌లో పెట్టింది. ఈ జాబితాలో నాలుగు టీఆర్‌ఎస్‌ సిట్టింగ్‌ సెగ్మెంట్లు ఉండటంతో ఆ ఎంపీల్లో ఆందోళన పెరుగుతోంది.

ఆయా సిట్టింగ్‌ ఎంపీలు, ఆశావహులు పరస్పరం ఫోన్లు చేసుకుంటూ ‘అన్నా ఆ సెగ్మెంట్‌పై అధిష్టానం స్పష్టత ఇచ్చిందట. మీకు సమాచారం వచ్చిందా? ఫోన్‌ వస్తే నాకు కచ్చితంగా చెప్పండి’అని చెప్పుకుంటున్నారు. పెండింగ్‌ సీట్లపై ఒకట్రెండు రోజుల్లోనే స్పష్టత వస్తుందని తెలుస్తోంది. కరీంనగర్‌ ఎన్నికల ప్రచార సభ తర్వాత లేదా మంగళవారం నిజామాబాద్‌లో జరగనున్న బహిరంగ సభ తర్వాతే అభ్యర్థులపై స్పష్టత వస్తుందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు.

కాంగ్రెస్‌ ఇప్పటికే 8 స్థానాల్లో అభ్యర్థులను ప్రకటించింది. ఆదివారంలోగా మిగిలిన సీట్లకు అభ్యర్థులను ప్రకటిస్తే టీఆర్‌ఎస్‌ అభ్యర్థుల ప్రకటన ముందుగానే జరగవచ్చని తెలుస్తోంది. ఆరు లోక్‌సభ సెగ్మెంట్లలో అభ్యర్థుల ఖరారుపై టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఇంకా నిర్ణయం తీసుకోనట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్, నల్లగొండ, ఖమ్మం, మహబూబాబాద్, పెద్దపల్లి, సికింద్రాబాద్‌ స్థానాల్లోని అభ్యర్థులపై స్పష్టత రాలేదు. ఈ సెగ్మెంట్లలోనూ అభ్యర్థులను ఖరారు చేసి అన్ని సీట్లకూ ఒకేసారి జాబితాను విడుదల చేసే అవకాశం ఉందని టీఆర్‌ఎస్‌ ముఖ్య నేతలు చెబుతున్నారు. 

►నల్లగొండ సిట్టింగ్‌ ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి రాష్ట్ర ప్రభుత్వంలోనే తనకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. దీంతో ఇక్కడ అభ్యర్థి ఎవరనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు. టీఆర్‌ఎస్‌ అధిష్టానం ఈ స్థానంలో తేరా చిన్నపరెడ్డి, వి. నర్సింహారెడ్డి పేర్లను పరిశీలిస్తోంది. 

►మహబూబ్‌నగర్‌ లోక్‌సభ సెగ్మెంట్‌లో సిట్టింగ్‌ ఎంపీ జితేందర్‌రెడ్డి అభ్యర్థిత్వం ఖరారుపై ఉత్కంఠ పెరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారన్న ఫిర్యాదుల నేపథ్యంలో ఆయన అభ్యర్థిత్వాన్ని అధిష్టానం పెండింగ్‌లో పెట్టింది. మాజీమంత్రి సి.లక్ష్మా రెడ్డి, పారిశ్రామికవేత్త మన్నె శ్రీనివాస్‌రెడ్డి పేర్లను అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. 

►ఖమ్మం సిట్టింగ్‌ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అభ్యర్థిత్వం డోలాయమానంలో ఉంది. అసెంబ్లీ ఎన్నికల్లో తమను ఓడించేందుకు పొంగులేటి ప్రయత్నించారని టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు అధిష్టానానికి ఫిర్యాదు చేశారు. దీనికితోడు ఈ సెగ్మెంట్‌లో ఖమ్మంలోని మరో కీలక సామాజికవర్గానికి అవకాశం ఇవ్వాలని టీఆర్‌ఎస్‌ భావిస్తోంది. దీంతో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు, వంకాయలపాటి రాజేంద్రప్రసాద్‌ పేర్లను పరిశీలిస్తోంది. 

►మహబూబాబాద్‌ సెగ్మెంట్‌ అభ్యర్థిపై టీఆర్‌ఎస్‌ అధినేత ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. సిట్టింగ్‌ ఎంపీ అజ్మీరా సీతారాం నాయక్‌ చివరి నిమిషంలో టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యేలు మాలోతు కవిత, ఢిల్లీలో రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి రామచంద్రు నాయక్‌ పేర్లను కూడా అధిష్టానం పరిగణనలోకి తీసుకుంటోంది. 

►పెద్దపల్లి అభ్యర్థి ఖరారుపై ఇంకా స్పష్టత రాలేదు. గత ఎన్నికల్లో ఈ స్థానం ఉంచి కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసి ఓడిపోయిన జి. వివేకానంద టికెట్‌ ఆశిస్తున్నారు. అయితే వివేకానంద అసెంబ్లీ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వ్యతిరేకంగా పనిచేశారని పార్టీ అధిష్టానానికి ఫిర్యాదులు అందాయి. దీంతో అన్నింటినీ పరిశీలించి నిర్ణయానికి రావా లని టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ భావిస్తున్నా రు. చివరి నిమిషంలో వివేకానందకు టికెట్‌ ఖరారయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. 

►సికింద్రాబాద్‌ సెగ్మెంట్‌లో టీఆర్‌ఎస్‌ అధినేత సామాజిక సమీకరణాలను పరిగణనలోకి తీసుకొని టికెట్లను ఖరారు చేస్తున్నారు. తలసాని సాయికిరణ్‌ యాదవ్, బొంతు శ్రీదేవి యాదవ్, దండె విఠల్‌ పేర్లను పరిశీలిస్తున్నారు. 

►టీఆర్‌ఎస్‌ అధిష్టానం పది స్థానాలపై స్పష్టతకు వచ్చింది. ఈ స్థానాల్లో అభ్యర్థులుగా ఉండే వారికి అనధికారికంగా సమాచారం ఇచ్చింది.

సమాచారం ఇచ్చిన స్థానాలు ఇవీ
ఆదిలాబాద్‌: గోడం నగేశ్‌ 
కరీంనగర్‌: బోయినపల్లి వినోద్‌ కుమార్‌ 
నిజామాబాద్‌: కల్వకుంట్ల కవిత 
జహీరాబాద్‌: భీంరావు బసంత్‌రావు పాటిల్‌ 
మెదక్‌: కొత్త ప్రభాకర్‌రెడ్డి 
భువనగిరి: బూర నర్సయ్యగౌడ్‌ 
వరంగల్‌: పసునూరి దయాకర్‌ 
చేవెళ్ల: జి. రంజిత్‌రెడ్డి 
మల్కాజిగిరి: కె. నవీన్‌రావు 
నాగర్‌ కర్నూల్‌: పి. రాములు  
 

మరిన్ని వార్తలు

20-03-2019
Mar 20, 2019, 19:37 IST
సాక్షి, విశాఖపట్నం: జిల్లాలోని మాడుగుల శాసనసభ నియోజకవర్గానికి సంబంధించి టీడీపీ, జనసేన పార్టీల అభ్యర్థుల ఎంపిక ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. అన్న...
20-03-2019
Mar 20, 2019, 19:33 IST
టీడీపీ అరాచక పాలనపై ఏపీ ప్రజలు విసుగెత్తిపోయారని అందుకే మార్పురావాలని కోరుకుంటున్నారన్నారు. ఏపీ ఎన్నికల్లో వైఎస్సార్‌ సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమన్నారు.  ...
20-03-2019
Mar 20, 2019, 19:24 IST
సాక్షి, గద్వాల: తెలంగాణ పీసీసీ నాయకత్వ వైఫల్యం కారణంగానే కాంగ్రెస్‌ పార్టీకి ఘోర పరాజయాలు ఎదురవుతున్నాయని బీజేపీ నేత డీకే అరుణ అన్నారు. పార్టీ మారినందుకు తానను వ్యక్తిగతంగా...
20-03-2019
Mar 20, 2019, 19:02 IST
నువ్వు నాకు చెప్పేదేంటని ఆగ్రహంతో లక్ష్మారెడ్డిపై చలమారెడ్డి చేయి చేసుకున్నారు.
20-03-2019
Mar 20, 2019, 18:48 IST
ఆప్‌తో పొత్తు పెట్టుకునే విశయమై ‘టు బీ నాట్‌ టు బీ’ అన్న సందిగ్ధంలో కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికీ కొట్టు...
20-03-2019
Mar 20, 2019, 18:02 IST
పట్నా: బీజేపీ రెబ‌ల్‌ ఎంపీ ఎంపీ శ‌తృఘ్న సిన్హా.. ఈసారి లోక్‌స‌భ ఎన్నిక‌ల్లో కాంగ్రెస్ త‌ర‌పున పోటీ చేయనున్నట్లు తెలుస్తోంది. గత...
20-03-2019
Mar 20, 2019, 17:43 IST
తక్షణమే మాధవ్‌ వీఆర్‌ఎస్‌ను ఆమోదించాలని ట్రిబ్యునల్‌.. ఏపీ ప్రభుత్వాన్ని ఆదేశించింది.
20-03-2019
Mar 20, 2019, 17:29 IST
భువనేశ్వర్‌: ఒడిషా ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్‌ పార్టీ (బీజేడీ) అధ్యక్షుడు నవీన్‌ పట్నాయక్‌ బుధవారం నామినేషన్‌ వేశారు. ఆయన మొదటిసారి...
20-03-2019
Mar 20, 2019, 17:23 IST
సాక్షి, పలమనేరు(చిత్తూరు): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఏ నేరం చేయకపోతే.. సీబీఐకి, ఈడీకి, తెలంగాణ పోలీసులకు ఎందుకు భయపడుతున్నారని వైఎస్సార్‌...
20-03-2019
Mar 20, 2019, 17:16 IST
ఎన్నికల సమీపిస్తున్నా టీడీపీలో అసమ్మతి చల్లారలేదు.
20-03-2019
Mar 20, 2019, 17:15 IST
సాక్షి, కర్నూలు: తెలుగుతేశం పార్టీ నేతలు ఎన్నికల కోడ్‌ను అడుగడుగునా ఉల్లంఘిస్తున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎలక్షన్‌ కోడ్‌ అమలులో ఉన్నా కూడా పట్టించుకొవడం లేదు. నిబంధనలంటే తమకు లెక్కలేదన్నట్టుగా...
20-03-2019
Mar 20, 2019, 17:10 IST
భౌతికకాయంపై ఉంచిన పువ్వులు వాడనే లేదు. ఆయన చితాభస్మం చల్లారనూ లేదు.
20-03-2019
Mar 20, 2019, 16:44 IST
శ్రీనగర్‌: జమ్మూ కశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) మధ్య పొత్తు చిగురించింది. మొత్తం 6 లోక్‌సభ స్థానాలు ఉన్న...
20-03-2019
Mar 20, 2019, 16:24 IST
అభ్యర్థుల ముఖం కాదు ..నా ముఖం చూసి కేసీఆర్ ఓటేయమంటున్నారు.
20-03-2019
Mar 20, 2019, 16:12 IST
సాక్షి, పశ్చమ గోదావరి: తాను పార్టీ మారుతున్నానంటూ వస్తున్న వార్తల్లో నిజం లేదని జిల్లా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ బీసీ...
20-03-2019
Mar 20, 2019, 16:01 IST
న్యూఢిల్లీ: దేశ రాజకీయల్లో గత కొన్ని రోజులుగా చౌకీదార్‌ అనే పదం బాగా పాపులరైంది. ప్రధాని నరేంద్రమోదీ తనను తాను...
20-03-2019
Mar 20, 2019, 15:58 IST
తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు హామీలిస్తుంటారు. ఆ తర్వాత పట్టించుకోరు. ఆ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి, అసెంబ్లీ అభ్యర్థి పరసా...
20-03-2019
Mar 20, 2019, 15:36 IST
సాక్షి, కృష్ణా: ప్రతిపక్ష పార్టీకి చెందిన ఏ ఎమ్మెల్యేలు వచ్చినా దివంగత నేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి సమస్యను పరిష్కరించేవారని...
20-03-2019
Mar 20, 2019, 15:36 IST
సాక్షి, కావలి (నెల్లూరు): అధికార పార్టీ నాయకుల హోదాలో కావలి టీడీపీ నాయకులైన బీద సోదరులు ప్రభుత్వ నిధులను లూటీ చేయడాన్ని...
20-03-2019
Mar 20, 2019, 15:19 IST
సాక్షి, న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీపై కాంగ్రెస్‌ చీఫ్‌ రాహుల్‌ గాంధీ నిప్పులు చెరిగారు. మోదీ తీరుతో 2018లో రోజూ...
Advertisement
Advertisement

*మీరు వ్యక్తం చేసే అభిప్రాయాలను ఎడిటోరియల్ టీమ్ పరిశీలిస్తుంది, *అసంబద్ధమైన, వ్యక్తిగతమైన, కించపరిచే రీతిలో ఉన్న కామెంట్స్ ప్రచురించలేం, *ఫేక్ ఐడీలతో పంపించే కామెంట్స్ తిరస్కరించబడతాయి, *వాస్తవమైన ఈమెయిల్ ఐడీలతో అభిప్రాయాలను వ్యక్తీకరించాలని మనవి

Back to Top