
సాక్షి,హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవిత చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ స్పందించారు. కవితలో ఇంత ఆవేదనతో ఉంది అనే విషయం ఈ రోజే తెలిసింది. కవిత వ్యాఖ్యలపై పార్టీలో చర్చ జరుగుతుంది. కవితతో మాట్లాడే ప్రయత్నం చేస్తా. కవిత సమస్యపై పార్టీలో తొందరలోనే కొలిక్కి వస్తుందని అనుకుంటున్నా.
చిట్ చాట్‌లో మాట్లాడిన దానికి పార్టీ ఎలా షోకాజ్ నోటీసులు ఎలా ఇస్తాము. టీడీపీ, కాంగ్రెస్, వామపక్షాలతో కలిసి పనిచేశాం. .ఒక బీజేపీతోనే మేము కలిసి పనిచేయలేదు. రాజకీయాల్లో ప్రకంపనలు సహజం. చాలా పార్టీల్లో ఇలాంటి ప్రకంపనలు చూశాం. మా పార్టీ మొదటిది కాదు , చివరిది కాదు. పార్లమెంట్ లో కరుణానిధి, అళగిరి, కనిములి ఫ్యామిలీ రాజకీయాలు చూశాం.
సమస్యలు త్వరలోనే ఖచ్చితంగా సద్దుమణుగుతాయి. ఒక్క బీజేపీతో మాత్రమే పని చేయలేదు. బీజేపీతో కలిసి పనిచేయాలనుకుంటే ఎప్పుడో పొత్తు పెట్టుకునేవాళ్ళం ’ అని వ్యాఖ్యానించారు.