చంద్రబాబుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదు.. | Participate in Jagan's struggle: Nani | Sakshi
Sakshi News home page

జగన్‌ పోరాటంలో భాగస్వాములవ్వండి : ఆళ్ల నాని

Mar 20 2018 4:12 PM | Updated on Jul 25 2018 4:07 PM

సాక్షి, జంగారెడ్డిగూడెం: తెలుగుదేశం పార్టీకి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్నా ప్రత్యేక హోదా సాధన కోసం వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేసే పోరాటంలో  భాగస్వాములవ్వాలని ఆళ్లనాని పిలుపునిచ్చారు. పశ్చిమగోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ప్రత్యేక హోదా అంశంపై చంద్రబాబు నాయుడుకు ఏమాత్రం చిత్తశుద్ధి లేదని, ఆయన మాటల్ని, చేస్తున్న మోసాలను ప్రజలెవ్వరూ నమ్మడం లేదని అన్నారు. ప్రత్యేక హోదా కోసం ఉద్యమాలు చేస్తున్న వైఎస్సార్‌సీపీ, వామపక్షాల పార్టీలపై చంద్రబాబు ఉక్కుపాదం మోపుతున్నారని అన్నారు. ప్రత్యేక హోదా నినాదం చేసిన వారిని అరెస్టులు చేసిన ఘనత చంద్రబాబుదేనని విమర్శించారు.

Advertisement
 
Advertisement
Advertisement